అయ్యప్పస్వాములకు అన్నదాన సేవ చేసే భాగ్యం రావడం అంటే ఆ అయ్యప్పకు సేవచేసినట్టుగానే భావిస్తున్నామని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు చైర్మన్, సినీ నిర్మాత కళాభోజ, ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ట్రస్టు ఆధ్వర్యంలో 18రోజుల పాటు నిరంతరాయంగా చేపట్టే అన్నసమారాధన ఆయన ఆరిలోవ సూర్యతేజ నగర్, శ్రీ పోలమాంబ వేపచెట్టు వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్పస్వాములతో కలిసి మధ్యాహ్నాం పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 18 రోజుల పాటు తన స్వంత నిధులతో అన్నసమారాధన చేస్తున్నట్టు వివరించారు.అయ్యప్ప, భవానీ, మాలధారణ చేసిన 300కి పైగా స్వాములకు అన్నదానం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉపకార్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అవి నిత్య సేవలుగా ముంద రోజుల్లో కూడా కొనసాగుతాయన్నారు.
పోర్టు ఆసుపత్రి ఏరియాలోని అయ్యప్ప పీఠం వద్ద కూడా స్వాముల అన్నసమారాధనకు ఇటీవలే రూ.3 లక్షలు ఎరిమేలి అయ్యప్ప అన్న సమారాధన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి మిలీనియం సినీ హీరో కంచర్ల ఉపేంద్ర బాబు మూడు లక్షలు విరాళం అందజేసినట్టు తెలిపారు. ఇప్పటికే అనేక పీఠాలకు, ఆలయాలకు అంబలం పూజలకు, అన్నదానానికి భారీగా విరాళాలు ఇచ్చినట్టు చెప్పారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, కంచర్ల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనియాడారు .ఉపేంద్ర బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడులా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. స్వాములకు ఇంత పెద్ద స్థాయిలో అన్నదానం చేయడం అంటే మామూలు విషయం కాదన్నారు. ఎంతో వ్యవప్రయాసలకోర్చైనా స్వాముల సేవలో కంచర్ల తరిస్తున్నారంటే ఆయనపై అయ్యప్ప దీవెనలు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ సుధీర్, ఎస్. ఎస్. ఎల్. ఎస్ క్రియేషన్స్ మేనేజర్ నాగు, ట్రస్ట్ ప్రతినిధులు అరుణ తదితరులు పాల్గొన్నారు.