అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని మంత్రి వాసంశెట్టి సుభాష్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆదివా రం ఆలయానికి చేసుకున్న మంత్రి కుటుంబానికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం చేయించారు. అక్కడ మంత్రి కుటుంబం స్వామివారికి పూజలు చేసింది. ఆలయ సిబ్బంది మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించగా..వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.