విశాఖలో జివిఎంసీ కార్పోరేటర్ కాకి గోవింద రెడ్డి జివిఎం కౌన్సిల్ సమావేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై సచివాలయ ఉద్యోగులు గురు వారం సాయంత్రం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. సచివాలయ ఉద్యోగులకు ఏం పనిలేదని ఖాళీ ఉన్నారని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పాలన్న ఉద్యోగులు.. ఒక రోజంతా సచివాలయ ఉద్యోగులతో విధి నిర్వహణలో పాల్గొంటే ఉద్యోలు ఏం చేస్తున్నారో తెలుస్తుందని హితవు పలికారు. ఏ ప్రభుత్వశాఖలో లేనివిధంగా ఒక ఉద్యోగంతో అన్ని ప్రభుత్వశాఖల విధులు చేస్తున్నది సచివాలయ ఉద్యోగులు మాత్రమేనని హితవు పలికారు.
చేస్తున్నది ఒక శాఖ ఉద్యోగమే అయినా.. అన్ని ప్రభుత్వ శాఖల విధులు చేస్తున్నది ఒక్క సచివాలయ ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఇదే సచివాలయ ఉద్యోగులు కోవిడ్ లోప్రాణాలకు తెగించి పనిచేసినపుడు తాము ఏం చేశామో వీళ్లకి కనిపించలేదాని ప్రశ్నించారు. ఈరోజు ఇంటి పన్నులు, నీటి పన్నులు కార్పోరేషన్ కి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో పెరుగుతున్నాయంటే అది ఒక్క సచివాలయ ఉద్యోగులు పనిచేస్తేనే జరుగు తుందన్నారు. ప్రభుత్వం తమకు అప్పగించే పనులు విధి నిర్వహణలో కాకుండా సాయంత్రం ఐదు దాటిన తరువాత అప్పగించినా ముఖ్య మంత్రి నారాచంద్రబాబునాయుడు పిలుపుతో సేవలు చేస్తున్నామన్నారు. వాలంటీర్లు చేసే క్లస్టర్ మేపింగ్ పనులు, డోర్ టూ డోర్ సర్వేలు కూడా చేస్తున్నామన్నారు. ఎంతో ఉన్నత విధ్యలు చదువుకొని కేవలం ప్రభుత్వ ఉద్యోగమనే కారణంతోనే చిన్న ఉద్యోగమైనా సేవలు చేస్తు న్నామన్నారు.
తాము కేవలం నెలకి రూ.30వేలు మాత్రమే తీసుకుంటున్నామని అన్నారు. ఇతర ప్రభుత్వశాఖలకు ఉద్యోగుల మాదిరిగా రెండవ శనివారాలు, ఆదివారాల్లోనూ తాములు సెలవులు తీసుకోకుండా ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నామన్నారు. అలాంటి తమపై జీవిఎంసీ కార్పోరేట్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండి పడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రాకముందు సేవలకి, తాము వచ్చిన తరువాత అందు తున్న సేవలు ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలన్నారు. తాము చేస్తున్న పనులను ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు గుర్తించిన విషయాన్ని కార్పోరేటర్లు తెలుసుకోవాలన్నారు.
వాస్తవానికి ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన పదోన్నతులు, సర్వీసు నిబంధనలు ఇవ్వకపోయినా.. ప్రభుత్వ సేవకులుగా ప్రజలకు అన్ని రకా లుగా ఉపయోగపడుతున్నామన్నారు. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా తమకు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పనులు అప్పగించాలని, సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్, పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు పాల్గొని తమ ఆందోళనను, ఆవేదనను తెలియజేశారు. శాంతియుతంగా మొబైల్ లైట్ నిరసన తెలియజేశారు.