చోడవరం పాలిటెక్నిక్ కళాశాలలో లైంగిక వేధింపుల పర్వం


Ens Balu
14
chodavaram
2024-12-12 16:10:39

తప్పుచేసిన వారిని కాపాడడానికి ఒక్కోసారి జిల్లా అధికారులు చేసే చేష్టలు.. చర్యలు ప్రభుత్వ తీరుకే మచ్చతెస్తాయి. గతం కొత్త కాలంగా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కెమెస్ట్రీ లెక్చిరర్ విద్యార్ధినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీనిపై పోలీసు కూడా నమోదైంది. అయితే దానిని కప్పిపుచ్చేందుకే అన్నట్టుగా జిల్లా అధికారులు వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తున్నది. ఒక ప్రక్క ప్రభుత్వం మహిళలను వేధిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదని హెచ్చరిస్తున్నా.. చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లైంగిక వేధింపులు తారా స్థాయికి చేరుకోవడం.. దానిని అధికారులు లైట్ తీసుకొని మీడియా దృష్టిలో పడకుండా జాగ్రత్త పడటం అనుమానాలకు తావిస్తుంది. తప్పు చేసినా.. విద్యార్ధినిలను బెదిరించి ఏమీ లేదన్నట్టుగా చేయాలని చూస్తున్నారా అనే ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో కళాశాలలో ఆర్జేడీ విచారణ కూడా రహస్యంగా సాగడం చర్చనీయాంశం అవుతున్నది.

 చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై శాఖారమైన చర్యలు తీసుకోపోగా, గురువారం  ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో ఆర్జెడి రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జెడి రాకను గమనించిన స్థానిక విలేఖరులు, ఆయనను కలిసేందుకు ప్రయత్నించగా, కళాశాల యాజమాన్యం  అనుమతించలేదు. ఈ మేరకు స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినిలు పట్ల అసభ్యకరంగా, లైంగికంగా దాడి చేస్తున్న కెమిస్ట్రీ అధ్యాపకుడు సూరెడ్డి కనకారావు పై బాధితురాలు వారి బంధువులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే విద్యార్థిని స్నేహితులు బంధువులు కళాశాలలో తనపై దాడి చేసి గాయపరిచారని  మరో అద్యాపకుడు కనకారావు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ఇరువురు నుండి ఫిర్యాదులు తీసుకున్న పోలీసులు విచారణ చేపడతామని సీ.ఐ.అప్పలరాజు తెలియజేశారు. ఈ నేపధ్యంలో విద్యార్థినిలు పై లైంగిక దాడుల కు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళ, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.