ప్రమాద బాధితునికి ‘మేమున్నాం’టీమ్ ఆర్థిక చేయూత


Ens Balu
4
koyyuru
2024-12-20 13:30:27

 ఆపదలో ఉన్న వ్యక్తులను ఆదుకునేందుకు ‘మేమున్నాం టీం’ వ్యవస్థాపకుడు అనిశెట్టి చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు ఎల్లప్పుడూ ముం దుంటారు. కోవిడ్ సమయంలో బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పడిన మేమున్నాము టీం ప్రతినిధులు నాటి నుండి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నారని తెలుసుకున్న టీమ్ అధ్యక్షుడు చిరంజీవి తనకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన యాళ్ల శ్రీను గత నెల 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులు తక్షణసాయంగా రూ. 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వైద్య సేవలకు తోడ్పాటు అందించారు.

అనంతరం అతని పరిస్థితిని టీం సభ్యులు, స్నేహితులు శ్రేయోభిలాషులకు తెలియజేసి సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జిసిసి మాజీ చైర్మన్ ఎంవివి ప్రసాద్ ద్వారా బాధిత కుటుంబీకులకు అందజేసి మేమున్నాము అనే భరోసా కల్పించారు. అలాగే క్షతగాత్రుడు శ్రీను భార్య బాలింత కావడంతో అనిశెట్టి బ్రదర్స్ 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు కూరగాయలను అందజేశారు. ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆదుకున్న చిరంజీవి శ్రీ లక్ష్మీ దంపతులతో పాటు మేమున్నాము టీం సభ్యులు తమకు సహాయ సహకా రాలు అందించిన అందరికీ బాధిత కుటుంబీకుల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన అభ్యర్థన మన్నించి బాధిత కుటుంబీకులకు సహాయ సహకారాలు అందించిన దాతలు శ్రేయోభిలాషులకు చిరంజీవి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, మాజీ ఎంపీటీసీ బి శివరామరాజు, టిడిపి నేతలు రొంగల గోవిందు చంద్రరావు కిముడు శ్రీరాములు కృష్ణ తదితర పలువురు పాల్గొన్నారు.