విశాఖలోని ఆరిలోవ దరి హనుమంతువాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉపకార్ ట్రస్టు అధినేత, సినీ నిర్మాత, కళాభోజ, నిశ్వార్ధ సేవకులు డా.కంచర్ల అచ్యుతరావు సిసి కెమెరాలు, నూతన సౌండ్ సిస్టమ్ ను శుక్రవారం సమకూర్చారు. ట్రస్టు కార్యాలయ సిబ్బంది నాగు ఆధ్వర్యంలో వాటిని పోలీసులకు అందజేశారు. ఇటీవల ఈ ప్రాంతంలో అవసరమైన సామాగ్రిని మార్పుచేయడానికి ట్రాఫిక్ పోలీసులు చేసిన అభ్యర్ధ మేరకు ఉపకార్ ట్రస్టు నుంచి వెంటనే వాటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సేవలందించేందుకు ఉపకార్ ట్రస్టు ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ప్రజా, ప్రభుత్వ సేవలు ఇకపై కూడా కొనసాగుతా యన్నారు.
అందునా ట్రాఫిక్ పోలీసులు ప్రయాణీకుల రక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తూ విధులు నిర్వహిస్తారని కొనియాడారు. వారికి ఎప్పుడు ఏవిధమైన సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీసు హెచ్చరికలు ప్రతీ ఒక్కరూ పాటించాలని కోరారు. పోలీసులు హెచ్చరికలు పాటించడం ద్వారా సురక్షితంగా గమ్యం చేరడానికి ఆస్కారం వుంటుందన్నారు. తోటివారికి తమ వంతు సహాయం చేసే విషయంలో ప్రతీ ఒక్కరూ ముందు రావాలని ఈ సందర్భంగా డా.కంచర్ల అచ్యుతరావు పిలుపునిచ్చారు.