కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం..సచివాలయ ఉద్యోగులు


Ens Balu
15
visakhapatnam
2024-12-20 19:09:07

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులమంతా కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలను అమలు చేయడానికి సిద్దంగా ఉన్నామని సచివాలయ ఉద్యోగ సంఘాల జేఏసి పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే గణబాబుని కలిసి వినతి పత్రం సమర్పించి. అపరిష్క్రుతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగానే ఖచ్చితమైన పనిగంటలు అమ లు చేయాలని, ప్రభుత్వం బకాయి ఉన్న 3 నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. 

ప్రస్తుతం ఇస్తున్న రూ.30వేలు జీతం ఎక్కడా తమ కుటుంబాలకు సరిపోవడం లేదని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు అమలు చేయాలని, ప్రభుత్వం మంజూరు చేసిన సెలవులను మంజూరు చేయాలని, సెలవు రోజుల్లో ప్రత్యేక విధుల నుంచి తప్పించాలని, కార్యాలయంలో స్టేషనరీ, ఇతర ఖర్చులు భారం ఉద్యోగుల మోపకుండా ప్రభుత్వమే అన్నీ మంజూరు చేయాలని, తాము చేస్తున్న సేవలు గుర్తించాలని, నేటికీ అమలు చేయాలని సర్వీసులు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయాలని, అధికారుల వేధింపులు, సమావేశాల్లో చులకన చేసి మాట్లాడాన్ని నియంత్రించాలని, తదితర సమస్య లు పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరారు. 

ఒక లక్షా 23 వేల పైచిలుకు ఉద్యోగులు వారి యొక్క కుటుంబాలతో సహా, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమకు మంచి చేస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు.  ఉద్యోగుల సమస్యలు విన్న ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులను తీసుకెళతానని చెప్పారన్నారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో బండారు శ్రీనివాస్,శిష్టు నాగేశ్వరరావు, పార్ధసారది, సురేష్ కుమార్, సుమంత్ అబ్రహం,  భార్గవ్ సుతేజ్, వెస్లీ, ధనుంజయ్, వరప్రసాద్ ,రాధిక, ఇంద్రజ , కృష్ణవేణి, వెంకన్న పాత్రుడు,   తదితరులు పాల్గొన్నారు.