విశాఖ జూ క్యూరేటర్ గా జి.మంగమ్మ బాధ్యతలు


Ens Balu
3
visakhapatnam
2024-12-26 12:47:22

విశాఖపట్నం ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు క్యూరేటర్ గా జి. మంగమ్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి అధికారిక ఉత్తర్వుల నేపధ్యంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. కాగా ఆమె అక్టోబర్ 7 నుంచి ఎఫ్ఏసి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సంద ర్బంగా సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జంతు ప్రదర్శన శాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించడంతోపాటు, అన్ని వర్గాల వారికి చేరువ చేస్తామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు.