అర్చకులు, పురోహితుల సమస్యల పరిష్కారానికి కృషి - మిలీనియం స్టార్ కంచర్ల ఉపేంద్ర బాబు


Ens Balu
12
Visakhapatnam
2024-12-29 10:20:48

ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంచే అర్చకులు, పురోహితుల సమస్యలు పరిష్కారం కావాలంటే సమిష్టిగా పనిచేస్తే సాధ్యపడుతుందని ప్రముఖ సినీ సంఘ సేవకులు, నటులు, మిలీనియం స్టార్  కంచర్ల ఉపేంద్ర బాబు అన్నారు. ఆదివారం బాలభాను పురోహిత, అర్చక సం ఘం ఆధ్వర్యంలో కంబాలకొండలో నిర్వహించిన వనమహోత్సవంలో హీరో ఉపేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో  మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి అర్చకులు పురోహితులు ఏకతాటిపై రావాలన్నారు. వీరి సంక్షే మం కోసం ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు కృషి చేస్తుందని..అదేవిధంగా తానూ అండగా ఉంటానని భరోసాఇచ్చారు. 

సర్వేజనా సుఖినోభవంతు అంటూ అందరినీ మంచి మనసుతో ఆశీర్వదించే అర్చకుల సమస్యల పరిష్కారానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే తన తండ్రి.. ప్రముఖ నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు పురోహితుల సమస్యలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అర్చకులు, పురోహితులు లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాల్లో విశాఖ అభివృద్ధిని కాంక్షిస్తూ పూజ లు చేయాలని కోరారు. అంతేకాకుండా  సినిమాల్లో నటించాలనే ఉత్సాహం ఉన్న యువతీ యువకుల కోసం ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ కార్యాలయంలో  సంప్రదించాలని కోరారు. 

అర్చక సంఘం అధ్యక్షులు జ్యోషుల కామేశ్వర శర్మ మాట్లాడుతూ,  తమ సంఘానికి స్థలం కేటాయించి భవన నిర్మాణానికి సాయం అందించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అనంతరం యువ హీరో కంచర్ల ఉపేంద్రబాబు అర్చక సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక, పురోహిత సంఘం వ్యవస్థాపకులు పంతుల వెంకటరమణ , మావుడూరు కిషోర్ కుమార్ శర్మ తో పాటు సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.