ప్రజా, పోలీసు సేవల్లో ఎల్లప్పుడూ ఉపకార్ ముందుంటుంది.. డా.కంచర్ల


Ens Balu
16
visakhapatnam
2024-12-31 05:39:52

మహావిశాఖలో ఉపకార్ ట్రస్ట్ నిరంతర సేవలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. అన్ని వర్గాల ప్రజలతోపాటు, ప్రభుత్వ, పోలీసుశాఖలకు కూడా తమవంతుగా అవసరమైన సామాగ్రిని అందిస్తూ.. అందని మన్ననలు పొందుతోంది.. కోరి కొలిచేవారికి కొంగుబంగారంగా.. ఆపద, సహా యం అన్నవారికి లేదనకుండా.. కాదనకుండా నిరాటంకంగా.. నిర్విరామంగా..నిశ్వార్ధంగా  సేవలు అందించే ఉపకార్ ట్రస్ట్ చైర్మన్, కళాభోజ, ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా.కంచర్ల అచ్యుతారావు పోలీసుల సేవలోనూ తరిస్తున్నారు.

 ప్రజలను పోలీసులు కంటికి రెప్పలా కాపాడుతుంటే.. వారికి కావాల్సిన వస్తు సామాగ్రిని ఇవ్వడానికి నేనున్నాంటూ ముందుకి వచ్చి అడిగిందే తడువుగా అన్ని సమకూరుస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజలే కాదు.. పోలీసులు కూడా ఇపుడు డా.కంచర్ల అందిస్తున్న సేవలను కీర్తిస్తున్నారు. ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ సేవల్లో ప్రతినిధులనే సేవకులుగా మార్చి అడిగిన వస్తుసామాగ్రి అందిస్తూ.. అందరివాడిగా నిలుస్తున్నారు డా.కంచర్ల..!

సమాజంలో మూడో స్థంభంగా ఉన్న పోలీసుశాఖకు సేవ చేయడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందడానికి ఆస్కారం వుంటుందని ప్రముఖ సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అధినేత డా. కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. గొడవలు, అల్లర్లు జరగకుండా ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి పోలీసులు చేసే విధి నిర్వహణ సమాజానికి చాలా అవసరని చెప్పారు. ఆరిలోవ క్రైమ్ పోలీస్ స్టేషన్ అభ్యర్ధన మేరకు సుమారు రూ.60వేలు విలువచేసే కలర్ ప్రింటర్, కంప్యూటర్లను ఉపకార్ ట్రస్టు ద్వారా వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకి పోలీసుల రక్షణ చాలా అవసరమన్నారు. 

అలాంటి పోలీసులకు ఉపకార్ ట్రస్టు ద్వారా కోరిన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునని కూడా భరోసా ఇచ్చారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులకు ఆడియో ఎక్విప్ మెంట్.. సిసి కెమెరాలను అందజేసిన డా. కంచర్ల ఇపుడు ఇపుడు ఖరీదైన ప్రింటర్, కంప్యూటర్లను కూడా అందించి పోలీసు సేవలో కూడా భాగస్వా మిగా నిలుస్తున్నారు. కాగా ఉపకార్ ట్రస్టు ద్వారా అందించే కంప్యూటర్,ప్రింటర్లను ఆరిలోపవ పోలీసులకు ఉపకార్ ట్రస్టు సిబ్బంది సుధీర్, రాజు, అందజేశారు.

 ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, తమ ఉపకార్ ట్రస్టు చైర్మన్ గా కాకుండా అందరు మెచ్చే నిశ్వార్ధ సేవకుడి వద్ద సహాయకులుగా పనిచేయడం ఆనందంగా ఉందని.. ఆయన చేసే ప్రతీ సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు.  ఉపకార్ ఛారిట బుల్ ట్రస్టుని  ఎల్లప్పడూ సేవల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు జీవనదిలా తమ చైర్మన్  సేవలు చేస్తూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ప్రజల తోపాటు, పోలీసులకు కూడా తమ ట్రస్టు ద్వారా అందిస్తున్న సేవలపట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.