అంతర్ రాష్ట్ర దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త-ఎస్ఐ


Ens Balu
5
krishnadevipeta
2025-01-16 14:42:33

అంతర్ రాష్ట్ర దొంగలు(నార్త్ ఇండియా గ్యాంగ్) గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని క్రిష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు సూచించారు. ఈ మేరకు ఆయన నర్సీపట్నం డీఎస్పీ సూచనలు మీడియా ద్వారా తెలియజేశారు. ఈ నార్త్ ఇండియా గ్యాంగ్ రాత్రి సమయంతోపాటు పగటి పూట కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ప్రజలు, గ్రామాల్లోని యువత అప్ర మత్తంగా ఉండాలన్నారు. గ్రామానికి చెందిన వారు కాకపోయినా.. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా వెంటనే పోలీసు స్టేషన్ కి సమాచా రం అందించాలన్నారు. గ్రామాల్లోని పెద్దలు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో ఇంట్లో పడుకునే సమ యం లో తలుపులు గట్టిగా వేసుకోవాలని హెచ్చరించారు.  ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు, సామాన్లు వెంటతీసుకు వెళ్లాలని ఎస్ఐ సూచించారు.