అనకాపల్లి రాజకీయాల్లో దాడివీరభద్రరావుది ప్రత్యేక స్థానం.. పాత్ర.. క్యాడర్ కు దిశా నిర్ధేశం.. చిటికెవేస్తే క్యాడర్ మొత్తం కళ్లముందుంటారు.. ఆదేశించిన పనిని ఐదునిమిషాల్లో చేయిస్తారు.. ప్రజల మనిషిగా.. పార్టీ నేతగా ఎంతో పేరు, హోదా, హుందా ఉన్న నేత ఇపుడు ఎందకనో మౌనం పాటిస్తున్నారు. కూటమి ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంతోపాటు, ఇతర నియోజవర్గాల్లోనే దాడి పాచికలు ఎంతగానో పనిచేశాయి. క్యాడర్ కూడా గట్టిగా పనిచేశారు. మంచి విజయాన్ని సాధించారు. అపుడే అంతా దాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వర్గంలోకి తీసుకుంటారని. కానీ ఆ ఊసే లేదు తెలుగుదేశం పార్టీలో. ప్రధాన కార్పోరేషన్ పదవులు.. చరిష్మా ఉన్న పదవులన్నీ చాలా మంది జూనియర్లకే కట్టబెట్టేస్తోంది టిడిపి. అపుడు కూడా దాడి ఊసుగానీ.. మాట గానీ లేదు. అలాగని పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కూడా దాడి ప్రస్తావనే ఉండటం లేదు. చోట నాయకులు స్టేజీల మీద హుందా కనిపిస్తుంటే ఎంతో సీనియర్, పార్టీకోసం శ్రమించిన వ్యక్తి విషయంలో పార్టీ వెనకడుగువేస్తుందా.. లేదంటే కూటమి నేతలే ప్రక్కన పెట్టారా..?
అసలు ఏం జరుగుతందని అనకాపల్లి నియోజకవర్గంలో దాడి మౌనంగా ఉంటున్నారనే విషయం ఒక్క అనకాపల్లి జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చలే జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నా.. ఏమవుతున్నా.. ఇటు దాడి వీరభద్రరావు సైతం మౌనాన్ని వీడి అసలు ఏం జరుగుతుంది.. ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని క్యాడర్ తో కూడా చర్చించడం లేదు. దీనితో ఆయనకోసం, పార్టీ సూచించిన అభ్యర్ధుల గెలుపు కోసం పనిచేసి వారంతా ఇపుడు డీలా పడిపోతున్నారు. అధినేత యాక్టివ్ గా లేకపోవడంతో.. కూటమి నేతల కార్యక్రమాలకు కూడా కొందరు దూరంగానే వుంటున్నారు. తమ నాయకుడిని పార్టీ గుర్తించలేదన్నట్టుగానే క్యాడర్ మొత్తం నిరాశగా ఉన్నారు. పండుగలు, పబ్బాలు, ఎన్నికలే కాదు ఏ విషయంలోనైనా దాడి వీరభద్రరావుది జిల్లాలో ప్రత్యేక స్థానం.
అలాంటిది ఎన్నికల్లో ఎంతో గట్టిగా పనిచేసిన ఈయన ఒక్కసారి తెరమరుగు అయిపోయినట్టుగా కనీసం ఎక్కడా కనిపించ కుండా తిరుగుతుండటం దేనికి సంకేతమో ఎవరీ అర్ధం కావడం లేదు. అలాగని పార్టీలో ఎంతో కీలకంగా పనిచేసిన దాడి ఇద్దరు తనయులు కూడా తండ్రి బాటలోనే నెమ్మదైపోయారు. ఎప్పుడూ మీడియా వేదికగా అన్ని విషయాలు చర్చించే దాడి కుటుంబం అధికారిక కార్యక్రమాలకు దూరమవడం, ప్రభుత్వం కూడా కీలకమై పదవుల్లో వీరిని గుర్తించి పదవులు కట్టబెట్టకపోవడం కూడా క్యాడర్ కి రుచించడం లేదు. ఎన్నికల ముందు బాహాటం వైఎస్సార్సీపీని కాదని సొంత పార్టీ టీడిపిలోకి వచ్చి. నియోజవకర్గంలో తన పట్టుని నిలబెట్టిమరీ కూటమి అభ్యర్ధుల గెలుపు విషయంలో ఎంతో ముందుచూపుతో వ్యవహరించారు.
ఎన్నికల సమయంలో దాడి సహకారం కోరిన ఎమ్మెల్యే కొణతాల.. ఎంపీ సీఎం రమేష్ లు సైతం ఇపుడు ఎక్కడా ఎప్పుడూ దాడి ఊసెత్తకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. పార్టీలోని యాక్టివ్ గా పనిచేసే నాయకులు తటస్థంగా ఉన్నా.. మౌనంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా పార్టీలో ఒక వ్యతిరేక సంకేతం వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే చాలా మంది క్యాడర్ కూడా దాడి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వీళ్లు కూడా వెళ్లడం మానేస్తున్నారు. అలాగని నేతలు కూడా ఈయనను పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ ఇదంతా పార్టీ ఆదేశమా..? లేదంటే కావాలని చేస్తున్నారా..? అదీ కూడదంటే పదవులు ఇవ్వాల్సి వస్తుందని ఈ రకంగా చేస్తున్నారో తెలియడం లేదుంటున్నారు నియోజకవర్గంలోని క్యాడర్.
మాజీ మంత్రిగా ఎమ్మెల్సీగా అనకాపల్లి రాజకీయాలను శాసించిన దాడి ఇపుడు ఒక యోగిలా మౌనం వహించడం మాత్రం రానున్న రోజుల్లో పెను మార్పులకే సంకేతం అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో స్వయంగా దాడి గానీ.. లేదంటే టిడిపి.. అదీ కాదంటే కూటమి నేతలే ఈయన మౌనం వెనుక అసలు విషయాన్ని క్యాడర్ కి చెప్పాల్సిన సమయం ఆశన్నమైంది. లేదంటే ప్రస్తుతం ఉన్న క్యాడర్ కూడా పకి పనిచేస్తున్నట్టు నటించి.. తమ నేతను ప్రక్కన పెట్టేస్తే తామెందుకు పనిచేస్తామని అనుకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఫలితాలు స్పష్టంగా కనిపించే అశకాశం ఉంది. చూడాలి రాజకీయ విశ్లేషకులకు కూడా అందని దాడి మౌనం వెనుక అసలు రహస్యం ఏమై వుంటుందనేది..!