డ్రైనేజీలేక మురుగునీటితో సహవాసం..


Ens Balu
2
చిన్నగుమ్ములూరు
2020-09-30 20:56:43

అధికారుల అనాలోచిత నిర్ణయం ఆ గ్రామస్తుల పాలిటి శాపంగా మారింది. చినుకు పడితే చాలు నీరంతా గుమ్మంముందు తిష్టవేయడంతో ఎటూ వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో చినగుమ్ములూరు వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యం లో గతంలో సైడ్ డ్రైన్స్ లేకుండా రోడ్డు నిర్మాణాలు చేపట్టడంతో ఈ దుస్థితి వచ్చినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరుపోయే మార్గం లేకపోవడంతో రోడ్లన్నీ మురికి కాలువలను తలపిస్తున్నాయి. ఇక్కడ మురికిగా తయారైన పంచాయితీ రోడ్లు, అపరిశుభ్రతతో దుర్గంధం వెదజల్లుతున్న కనీసం పట్టించుకునేనాధుడే కరువయ్యాడని ఈ గ్రామస్తులు వాపోతున్నారు. చినగుమ్ములూరు గ్రామంలో ఏ వీధిలోనూ సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవడంతో స్నానపానాలు చేసిన వ్రుధానీరు కూడా రోడ్లపైకి వచ్చేస్తుంది. గ్రామస్తులు పంచాయితీకి ఎన్ని సార్లు పిర్యాదు చేసిన సైడ్ కాలువ కూడా నిర్మించపోవడంతో ఈ విషయాన్ని గ్రామస్తులు మీడియాకి ముందుకి తీసుకు వచ్చారు. మురికి, దుర్గంధం వలన పిల్లలు రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు లేని తమ గ్రామంలో ప్రభుత్వం తక్షణమే డ్రేనేజీలు తవ్వించాలని గ్రామస్తులు కోరుతున్నారు.