కక్షగట్టి సిసి కెమెరాలతో వేధిస్తున్నాడు..
Ens Balu
2
ఎస్.రాయవరం
2020-10-02 17:25:27
ఎస్.రాయవరంలో మాజీ ఎంపీటీసీ బొలిశెట్టిగోవిందరావు అక్రమాలు బయటపెడుతున్నాడనే అక్కసుతో సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇంటి ముందు సిసి కెమెరాలతో అనుమతి లేకుండా రికార్డింగులు చేయించి మరీ వేధింపులకు దిగడం చర్చనీయం అవుతోంది. రాజు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసుకునేందు ఏకంగా విద్యుత్ స్థంబాలను, టెలీఫోను స్థంబాలను వినియోగించి ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసినా సిసి కెమెరాలు ఏర్పాటు చేసిన బోలిశెట్టిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. రాజు ఇంటిముందు ఒకటి, ఎంపిపి స్కూలు విద్యుత్ స్థంబానికి ఒకటి, మరొకటి పక్కనే వున్న టెలీఫోన్ స్థంబానికి సిసికెమెరాలు అమర్చి రాజు ఏం చేస్తున్నాడో గమనిస్తున్నాడు. రాజ్యాంగ బద్ధంగా తాను జీవించే హక్కుకి బంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బోలిశెట్టిపై చర్యలు తీసుకోకపోగా, ఆయనకే ప్రభుత్వ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు సోమిరెడ్డి రాజు. ఒకరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక ప్రైవేటు వ్యక్తి సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరం అయినా అధికారులు పట్టించుకోకపోవడం చూస్తుంటే ఒక మాజీ ఎంపీటీసీ అధికారులను ఏ స్థాయిలో కట్టడి చేశాడో అర్ధం చేసుకోవాలని రాజు వాపోతున్నాడు. నాలుగు నెలలుగా సిసి కెమెరాల ద్వారా మా ఇంట్లో ఏం జరుగుతుందో అన్ని రికార్డు చేయిస్తున్నారని, కేవలం బొలిశెట్టి అక్రమాలపై జిల్లా కలెక్టర్ కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశాననే అక్కసుతో ఇదంతా చేస్తున్నారని సోమిరెడ్డి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంట్లో మహిళలు ఉన్నా నిరంతరాయంగా తమ ఇంటిలో జరుగుతున్నదంతా రికార్డు చేయిస్తున్నారని చెప్పాడు. పోలీసులు, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అనుమతి లేకుండా వినియోగిస్తున్న స్థంబాల విషయంలో నేటికీ ఎవరూ బోలిశెట్టిపై చర్యలు తీసుకోలేదన్నాడు. ఈవిషయమై డిఐజి ఆఫ్ పోలీస్, విశాఖపట్నం జిల్లా పంచాయతీ అధికారి, ఎస్.పి, రూరల్, విశాఖపట్నం, ఏఎస్పీ, నర్సీపట్నం, సిఐ, నక్కపల్లి, ఎస్.ఐ, యస్.రాయవరం కు ఫిర్యాదు చేస్తున్నట్టు రాజు మీడియాకి వివరించాడు.