మనీషా నిందితులను ఊరి తీయాలి..


Ens Balu
1
Sankhavaram
2020-10-02 20:55:19

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రశ్ జిల్లాలో వాల్మీకి సామాజిక వర్గ మహిళ మనీషాను సామూహిక బలాత్కారం చేసి ఆమె మృతికి కారణం అయిన నిందితులను తక్షణమే ఉరి తీయాలని ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్  రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆచార్య నునావత్ దేవదాస్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన శంఖవరంలో మీడియాతో మాట్లాడుతూ, మనీషా పార్థివ దేహం కడచూపును కూడా ఆమె తల్లి తండ్రులకు దక్కకుండా చేసి చాటుగా అంత్య క్రియలు చెయ్యడం పట్ల  ప్రజల్లో ఆక్రోశం పెల్లుబిగిసిందనీ, ఈ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సంఘటన ప్రజాస్వామ్యనికి గొడ్డలి పెట్టు అని అన్నారు. సుప్రీంకోర్టు ఈ పరిణామాలన్నీ స్వయంగా పర్యవేక్షించి సరైన విచారణ చేపట్టకపోతే మనీషా కుటుంబానికి న్యాయం జరగదని, నిందితులకు శిక్ష పడదని అన్నారు. కాబట్టి వెంటనే సుప్రీంకోర్టు ఈ విషయంపై  జోక్యం చేసుకుని నిందితులను తక్షణమే ఉరి తీయాలని  డిమాండ్ చేశారు.