ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకే వుంది..


Ens Balu
1
2020-10-08 13:44:26

ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క విద్యకే ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, విద్యార్దుల భవిష్యత్తు కోసం ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంతో పోటీ పడే పరిస్థితి మన పేద పిల్లలకు రావాలన్న సీఎం చదువే విద్యార్థులకు ఒక శక్తి అని పేర్కొన్నారు. పేదలకు మంచి విద్యాప్రమాణాలు అందించాలనే అంగన్‌వాడి నుంచి ఉన్నతవిద్య వరకు విప్లవాత్మక మార్పులు చేపట్టామని వివరించారు. నాడు -నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో రూపురేఖలు మారుస్తున్నాం. బడికి వెళ్లే పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు గోరుముద్ద పథకం తీసుకొచ్చాం. పేద పిల్లలు గొప్పగా చదవాలని భావించి ఒకటి నంచి టెన్త్ వరకు ప్రతి విద్యార్థికి విద్యాకానుక అందిస్తున్నామని చెప్పారు. నవంబర్ 2 లోగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 44.32 లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందిస్తామన్నారు. రూ.650 కోట్ల ఖర్చుతో విద్యాకానుకను అందిస్తున్నామన్న సీఎం కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మూడ్రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం విద్యను పక్కన పెట్టడంతో నిరుపేద విద్యార్ధులకు ఎంతో నష్టపోయార్నారు.  ఉన్నత విద్య వరకు ప్రతి విద్యార్థి చదువుకునేలా చేస్తామని..ఉద్యోగం ఇచ్చేందుకు ప్రపంచమంతా మన దగ్గరకు రావాలన్నారు.