కార్పోట్ స్థాయి విద్య అందించడమే లక్ష్యం..


Ens Balu
2
s.rayavaram
2020-10-08 19:22:32

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి భారీ మార్పులు తీసుకొచ్చారని పాయకరావు పేట ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు  గొల్లబాబూరావు అన్నారు. గురువారం ఎస్.రాయవరంలో జగనన్న విద్యా కానుక కింద విద్యార్ధులకు పాఠశాల కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదలకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించడానికి నాడు-నేడు కింద అన్ని పాఠశాలలను నిత్యనూతనంగా తయారు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విశేషం ఏంటంటే ప్రభుత్వ అధికారిక  కార్యక్రమాల్లో లేనిపోని హడావిడీ చేసే బొలిశెట్టిని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం విశేషం. అతని అనచరులు కూడా ఎమ్మెల్యే కార్యక్రమానికి రాకపోగా, కూతవేటు దూరంలో వున్న బొలిశెట్టి ఇంటి దగ్గరే ఉండి కార్యక్రమ విషయాలను తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఎమ్మెల్యే గొల్లబాబూరావు టూర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ కార్యక్రమాల్లో బొలిశెట్టి కనిపించకపోవడంతో, అతని అనుచరులను సైతం ఎమ్మెల్యే కావాలనే పక్కన పెట్టారనే ప్రచారం నియోజవకర్గంలో గట్టిగా సాగుతుంది.