పాయరావుపేట వైఎస్సార్సీపీలో తేడా రాజకీయం..!


Ens Balu
2
s.rayavaram
2020-10-10 09:48:51

పాయకరావుపేట నియోజకవర్గంలో అంతా తీవ్రంగా చర్చించుకునే తేడా రాజకీయం జరుగుతోంది.. దళిత ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్, ఉన్నత విద్యావంతుడు, మచ్చలేని మంచి మనిషి ఎమ్మెల్యే గొల్లబాబూరావుని కార్యకర్తల సమావేశంలో  వాడు, వీడూ అనేసి.. ఎమ్మెల్యే అవినీతి చిట్టా టైమొచ్చినట్టు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చేసి.. రాజైనా, రెడ్డైనా ఇంకెవరైనా నియోజవకర్గంలో మనల్ని కాదని పనిచేయడానికి బయపడేలా చేయాలని కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టి మరీ నోటికొచ్చినట్టు మాట్లాడేసి.. ఆపై ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చాలా మంచి వ్యక్తి నాయకులు, కార్యకర్తలు కోపంలో నోటికొచ్చినట్టు మాట్లాడేసినా మంచి మనసుతో క్షమించేసి..దూరం చేసిన మనల్ని అన్నీ మరిచిపోయి దగ్గర చేసేకుంటారంటారనే వ్యాఖ్యలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని వాడూ, వీడు అని మాట్లాడాలంటే ఏ స్థాయి నాయకుడై ఉండాలో, ఎంత అవినీతి చేస్తే ఆ స్థాయిలో మాట్లాడాతారో  అటు పార్టీలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ అందరూ గుర్తిస్తారు.. అలాంటిది ఒక సాధారణ ఎంపీటీసి అయిన బొలిశెట్టి ఎమ్మెల్యే గొల్లబాబూరావుతో పాటు, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని కూడా తన నోటికొచ్చినట్టు మాట్లాడిన కార్యకర్తల సమావేశం యొక్క ఆడియో,  స్వయంగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు నియోజకవర్గంలోని అన్ని మండాల్లో తనకు అన్యాయం జరుగుతుందని, తన పనిని తనని చేసుకోనీయకుండా చాలా మంది అడ్డుపడుతున్నారని, ఎమ్మెల్యేని మించి వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలోనే పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త  చంటి విషయంలో  ఎమ్మెల్యే కళ్లముందే తన్నుకున్న తరువాత, పార్టీ పరువుని ఏ స్థాయిలో చెడగొట్టాలో అంతా చెడగొట్టారు. ఆపై కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మనల్ని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తులను వెంటేసుకొని పనులు చేయిస్తున్నారనే అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడేసిన బొలిశెట్టి గోవింద్...ఇపుడు అదే కార్యర్తల సమావేశంలో కొందరు బాకా నాయకులతో భజనలు చేయించి, మరీ క్షమాపణ రాగం అందుకోడంతో...పాయకరావుపేట నియోజకవర్గంలో తేడా రాజకీయం జరుగుతుందంటూ కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. అయినా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఏం అధికార ముందని నోటికొచ్చినట్టూ మాట్లాడి ఇపుడు మళ్లీ క్షమించాలని కోరితే ఎమ్మెల్యే కరిగిపోతే దానికంటే చండాలం మరొకటి వుండదంటూ చర్చకు తెరలేపారు పాయకరావుపేటలోని నియోజకవర్గ కార్యకర్తలు. పైగా ఎమ్మెల్యేకి, తనకి కావాలనే కొందరు దూరం పెంచారనే కొత్త పల్లవి కూడా అందుకోవడం ఎమ్మెల్యేను కావాలనే తక్కువ చేయాలని చూస్తున్నట్టు, ఎమ్మెల్యేను బలంగా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో దెబ్బకొట్టిన వారిని దూరం పెట్టి ఏ విధమైన ట్రీట్ మెంట్ ఇస్తారో అందరికీ తెలిసిన విషయమే. దూరంపెట్టి ఎలాంటి పనులు కాకుండా చేసిన ఎమ్మెల్యేను మళ్లీ బుజ్జగించి, అన్నమాటలన్నీ ఉత్తుత్తివే అన్నట్టు చేయాలని చూస్తున్న రాజకీయం పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ కేడర్ ను అబాసు పాలు చేసేలా వుందనేది తేటతెల్లమవుతుంది. అటు పార్టీ అధిష్టానం సైతం ఎంపీటీసి లాంటి వ్యక్తులను ఆ స్థాయికే పరిమితం చేయాలి తప్పితే.. అంతకంటే ఎక్కువ చనువు ఇస్తే ఇలానే వుంటుందని కూడా మాటలు అనిపించుకున్నట్టు పాయకరావుపేటలోనూ, పార్టీలో తీవ్రస్థాయిలోనే ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో  బొలిశెట్టిని క్షమించేసి, మళ్లీ నువ్వే ఎస్.రాయవరంలో నాయకుడిగా ఉండాలని చెబితే పరిస్థితి ఎలా వుంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇంత రచ్చ జరిగి, ఎమ్మెల్యేని అందరూ అడిగేలా, వాడూ వీడు అన్నవ్యక్తి చాలా మంచివాడిగా క్రియేట్ చేయాలని చూస్తున్న బాజా కార్యకర్తల మాటలు ఎమ్మెల్యే నమ్ముతారా, లేదంటే నిజంగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి కోసం ఎమ్మెల్యే చూస్తున్నారా అనే విషయంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి వుంది..  నిజంగా ఎమ్మెల్యే మనసు మార్చుకుంటే అటు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోయడం, పార్టీని తక్కువ చేసి చూపడం ఖాయం. ఇప్పటికే ఆ దిశగా ప్రతిపక్షనేతలు ఎమ్మెల్యే తీసుకోబోయే నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. పాయకరావుపేట తేడా రాజకీయంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి..!