గిరి యువతకు కంప్యూటర్స్ పై ఉచిత ఆన్లైన్ శిక్షణ..


Ens Balu
1
2020-10-10 11:00:39

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గిరిజన యువతకు ప్రత్యేకించి ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ఎమ్మెస్ ఆఫీస్ పై ఇచ్చేందుకు దరఖాస్తు  లు  కోరుతున్నట్టు రంపచోడవరం ఐటిడిఏ పీవో ప్రవీణ్ ఆదిత్య శనివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం www.apssdc.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని  పొంది దరఖాస్తులు నింపి సమర్పించాలని కోరారు. రిజిస్ట్రేషన్ గడువు తేదీని పొడిగించడంతో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ జూమ్ లింక్ తో ఎమ్మెస్ ఆఫీస్ తరగతులు ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ తరగతులు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తారని మొత్తం శిక్షణ కాలం 40 గంటలు ఉంటుందన్నారు. ఇందులో బేసిక కంప్యూటర్  ఫండమెంటల్స్ అర్హతగా గుర్తించడం  జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి గల గిరిజన యువత దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కొరకు సెల్ నెంబర్ 7989656834 లో సంప్రదించాలని పీఓ సూచించారు...