ఏటిగట్టు డొల్లు...ప్రజల గుండె జల్లు..


Ens Balu
0
ఎస్.రాయవరం
2020-10-13 20:20:07

ఎస్.రాయవరం గ్రామంలో పొలాల్లో కట్టిన ఇంటి కోసం(బొలిశెట్టి ముఖ్య అనుచరుడు, ఎల్లపు నాగు) వరహానది ఏటిగట్టుని పది అడుగుల మేర తవ్వేసిన ప్రబ్రుతులు దానిని అలాగే వదిలేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది పొంగి ప్రవహించడంతో గట్టు పూర్తిగా నానిపోయి బలహీనంగా మారింది. ఆ గట్టు ఏ మాత్రం డొల్ల పడినా వరహానది వరద నీరు మొత్తం ఎస్.రాయవరం గ్రామంతోపాటు చుట్టుప్రక్కలర మూడు గ్రామాలను ముంచేస్తుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేత్తోపట్టుకొని జీవివిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ కు చెందిన ప్రభుత్వ భూమిని అప్పనంగా తవ్వేసినా, అధికారు చూసి అలానే వదిలేశారు తప్పితే రానున్న ప్రమాదాన్ని పసిగట్టి కనీసం గట్టు పూడ్పించలేదంటూ గ్రామానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇరిగేషన్ ఉన్నతాధికారులకు, మండల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం అధికారుల ద్వారా తెలుసుకున్న ఆక్రమణ దారులు వరహానది ఏటిగట్టు అవతల బాగాన్ని నీరు పోవడానికి తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. గట్టు ఇవతల తవ్విగే గ్రామాలకు ప్రమాదం, గట్టు అవతల తవ్వితే పంట పొలాల మునక ఎటు చూసినా అధికారులు చేసిన తప్పు ఇప్పుడు ఎస్.రాయవరం గ్రామప్రజల ప్రాణాల మీదకు తెచ్చింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరహానది నీరు గట్టుకి ఆనుకొని వున్న పొలాల్లోకి రావడతోపాటు అక్కడే వున్న ఒక ఇల్లూ పూర్తిగా నీటిలో మునిగి పోయింది. అసలే వరహానది ఏటి ప్రవాహం అధికంగా వుండటంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అంతా హడలిపోతున్నా, ఇరిగేషన్ అధికారులు, ఏటిగట్టును తవ్వినవారు ఏమీ పట్టనట్టు వ్యహరిస్తున్నారని సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. ఏటి గట్టు వాస్తవ పరిస్థితిని ఫోటోలు, వీడియోలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు..ఏటిగట్టు పూర్తిగా వరదనీటితో నానిపోయి డొల్లుగా మారడంతో ఎప్పుడు నది గట్టు నాని వరద ఊరిలోకి వచ్చేస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.