గిరిపుత్రుల అభివ్రుద్ధి సీఎం వైఎస్ జగన్ లక్ష్యం..


Ens Balu
2
Addateegala
2020-10-14 14:06:39

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత గిరిజనులకు  సాగు హక్కు కల్పించిన ఘనత ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని డిసిసిబి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మిలు స్పష్టం చేశారు. బుధవారం అడ్డతీగల మండలంలో 12 పంచాయతీల గిరిజనులకు మంజూరైన పట్టాలను గిరిజనులకు అందేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఎన్ని ప్రభుత్వాలు పాలించినా ఐటిడిఏల అభివ్రుద్ధి, ఆ ప్రాంతాల్లో మల్టీ స్పెషాలటీ ఆసుపత్రులను నిర్మాణానికి పూనుకున్నది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహరెడ్డి మాత్రమేనన్నారు. రంపచోడవరం లో 50 కోట్ల రూపాయలతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం మంజూరు చేసిందని ఇది పూర్తయితే ఈ ప్రాంత గిరిజనుల ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఎపడమిక్ సీజన్ లో గిరిజనులు వింత వ్యాధులు, జ్వరాలతో మ్రుతిచెందేవారని అలాంటి ఘటనలు ఇక పునరావ్రుతం కాకుండా ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి గిరిపుత్రు ఆరోగ్యాన్ని కాపాడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.