పారదర్శకంగా నరేగా పనులు..


Ens Balu
1
తిరుపతి
2020-10-14 15:31:32

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతతో పాటు జవాబుదారీతనం ఉండాలని రాష్ట్ర నరేగా డైరెక్టర్ చినతాతయ్య అన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రాయలసీమ జిల్లాలతోపాటు  నెల్లూరు జిల్లాల విజిలెన్స్ అధికారులతో , హెచ్ ఆర్ లతో డైరెక్టర్, నరేగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ విశ్వనాథ్  కలిసి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. నరేగా డైరెక్టర్ చినతాతయ్య  వివరిస్తూ  శాఖ సంబంధించి సిబ్బంది విషయంలో కొరత లేదని, నరేగా నిధులు ప్రక్క దారి పట్టకుండా అధికారులు దృష్టి పెట్టాలని అందులో పేదలకు కల్పించే పని దినాలు, రైతుల కోసం నిర్వహించే ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలని అన్నారు. జాబ్ కార్డుల మంజూరు, తరచూ అధికారుల సమావేశాలు, పనులు కల్పన, హాజరు పట్టికలకు సంబంధించిన వాటిలో ఖచ్చితత్వం, పారదర్శకత  ఉండాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా నరేగా నిధుల నిర్వహణ  చేయడానికి ప్రగతి నివేదికలను రూపొందించి అధికారులకు అందుబాటులోకి తీసుకొని రావాలని ప్రధాన కార్యాలయ విజిలెన్స్ అధికారి మల్లిఖార్జున కు సూచించారు. శాఖలలో పనిచేసి సిబ్బంది తమ వంతు భాద్యతగా తమ పనిని చేయగలగాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో నిర్వహించే సోషల్ ఆడిట్ విధానంలో మార్పు రావాలని, రైతు నీళ్ళు లేకనో,  ఇతర పంటల కోసమో ఎండిపోయి ,   కోల్పోయిన ఉద్యాన  పంటలుపై  పాడైన  3 సంవత్సరాల తరువాత సోషల్ ఆడిట్ చేసి  రైతు నుండి రికవరీ మంచిది కాదని సూచించారు.  మనం వారికి మూడు సంవత్సరాల కాలం ఉద్యాన పామతల మొక్కల  కాపాడటానికి మాత్రమే  ఖర్చులు  ఇస్తున్నామని, ఆతరువాత వర్షాభావ పరిస్థితులు, ఇతర కారాణాలు వల్ల ఎండిపోతే  మనం  వారిని   ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు.  ఆలోచన చేసి సకాలంలో సోషల్ ఆడిట్ నిర్వహించ గలిగితే వాస్తవాలు ప్రజలకు/ రైతులకు/ అధికారులకు తెలుస్తాయని అన్నారు. నరేగాలో వేతన జీవుల సంక్షేమం ప్రధానం కావాలని అన్నారు. శాఖలోని ప్రతి అధికారికి జాబ్ చార్టు ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమీక్షకు ముందు విజిలెన్స్ కమీషనర్ మల్లి ఖార్జున జిల్లా విజిలెన్స్ అధికారుల పనితీరును పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు.  పెండింగ్ రికవరీలు, పెండింగ్ కేసులు పరిష్కారంపై దృష్టి  పెట్టాలని విజిలెన్స్ అధికారులకు సూచించారు.  ఈ సమీక్షలో పిడి డ్వామా చంద్రశేఖర్ , జిల్లా విజిలెన్స్ అధికారులు కడప  రమణారెడ్డి, చిత్తూరు శివయ్య, నెల్లూరు వేంకటేశ్వరరావు, కర్నూలు అన్వర్ బేగం , హెచ్ ఆర్ లు పుష్ప, రవి కుమార్, ఆనంద కుమార్, విజయ కుమార్, శోబా రాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.