150 ఎకరాల్లో వరిపంట నీట మునక..
Ens Balu
1
Sankhavaram
2020-10-14 15:43:38
తూర్పుగోదావరి జిల్లా, శంఖవరం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 150 ఎకరాల్లో వరి పంట నీట మునగిపోయిందని వ్యవసాయాధికారి చంద్రశేఖర్ తెలియజేశారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాలను ప్రాధమికంగా అంచనా వేసినట్టు చెప్పారు. ఇందులో 90 ఎకరాల్లో వరి నేలకొరిగిందన్నారు. అదే విధంగా 110 ఎకరాల్లో పత్తి నీటమునిగందని వివరించారు. వర్షాలకు నీట మునిగిన పంటల్లో తీసుకోవాల్సిన చర్యలపై నేరుగా పంటపొలాల వద్దే రైతులకు వివరిస్తున్నట్టు చెప్పారు. వరి, పత్తి పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సేకరించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే నివేదించామన్నారు. అనంతరం వరదలు తగ్గిన తరువాత పంట పరిస్థితిని నేరుగా పరిశీలించనున్నట్టు వ్యవసాయాధికారి మీడియా వివరించారు.