గిరిజనుల సమస్యలు ప్రభుత్వం ద్రుష్టికి..


Ens Balu
2
చింతపల్లి
2020-10-14 20:27:06

గిరిజన సమస్యలను ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ పేర్కొన్నారు. ఆయన ఏజెన్సీ పర్యటన లో భాగంగా బుధవారం చింతపల్లి మండలం లంబసింగి గ్రామ సచివాలయంలో కాఫీ రైతులు, గ్రామస్థులు తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు సాగుచేస్తున్న పంటలు మార్కెట్ సదుపాయాలు ఆడిగితెలుసుకున్నారు. కాఫీకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పర్యాటకుల వలన ఎదురౌవుతున్న సమస్యలు గ్రామస్థులు వివరించారు. లంబసింగి గ్రామం నుంచి చేరువులవేనం గ్రామానికి రోడ్ నిర్మించాలని గ్రామస్తులు చైర్మన్ దృష్టి కి తేగా వెంటనే ఐటీడీఏ పి.ఓ గారితో ఫోన్ లో మాట్లాడి రోడ్ నిర్మించాలని కోరగా పిఓ సానుకూలంగా స్పందించారు. దుస్టుబిన్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పర్యాటక రంగంలో గిరిజన యువతకు శిక్షణ ఇప్పించాలని స్వయం ఉపాధి కల్పించాలని గిరిజన యువకులు కోరారు. సి ఎం దృష్టి కి తీసుకుని వెళతాను అన్నారు. గిరిజన యువత జర్నలిజం రంగంలోకి రావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. దానికి అవసరమైన ఏర్పాట్లు, ఫీజుల అకాడమీ చెల్లిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో వెలుగు ఎపిడి ఎం.నాగేశ్వరరావు ,తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడివో ఉషశ్రీ తదితరులు పాల్గొన్నారు