ఎంపీడీఓ, కార్యదర్శిలకు మెమోలివ్వండి..


Ens Balu
3
Nakkapalli
2020-10-17 20:38:13

విశాఖజిల్లాలోని నక్కపల్లి మండలం వేంపాడు సచివాలయంను జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేసారు.   ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి సమగ్ర వివరాలతో కూడిన డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎం .పి.డి.ఒ,  కార్యదర్శి లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు.   సచివాలయ సేవలపై ముఖ్యమంత్రి  నిరంతర ర్యవేక్షణ చేస్తున్నారని, సచివాలయం ద్వారా  అందించే  సేవల విషయం లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వాటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా గ్రామసచివాలయాల ద్వారా నూరుశాతం సేవలు అందించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.. ఈ  కార్యక్రమంలో  పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఇతర శాఖల అధికారులు  పాల్గొన్నారు. 
సిఫార్సు