శారదనది ముంపు నివారణకు పటిష్ట చర్యలు..


Ens Balu
2
Rambilli
2020-10-24 20:09:50

విశాఖజిల్లా రాంబిల్లి  మండలంలో ప్రవహిస్తున్న శారదా నది ముంపు బారినుండి పొలాలను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని  కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు.  శనివారం ఆయన రాంబిల్లి మండలం  రజాల గ్రామంలో ముంపుకు గురైన పంటలను, పొలాలను రెవిన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.  అల్పపీడనం కారణంగా కురిసిన వర్షం, నదిలో పెరిగిన నీటిమట్టం ఏ గ్రామాలలో ఏ విధంగా నీటి మట్టం పెరిగి గట్లు తెగి పోవుటకు కారణమైన అంశాలను గూర్చి విపులంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  సముద్రంలో నీరు కలిసే క్రమంలో గట్లు తెగడానికి గల కారణాలను   పరిశీలించాలని అన్నారు.  ముంపునకు కారణాలను అన్ని కోణాలనుంచి పరిశీలించి తక్షణం నివేదికను సమర్పించాలని రెవిన్యూ డివిజినల్ అధికారిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు  రైతుల పంటలు పొలాలు పాకలు మొదలైనవి ఏ విధంగాముంపుకు గురైనది అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం లెక్కగట్టి లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయం లో ప్రదర్శించాలన్నారు. పంట నష్టం సంభవించిన ఏ రైతు పేరు అయినా జాబితాలో చేరకపోతే వారు తెలియజేస్తారని చెప్పారు.  ఎన్.ఏ.ఓ.బి. వారు ప్రవాహానికి  అడ్డుగా మెస్ వేసినందున నదీజలాలు వెనుకకు ఎగదన్ని నది గట్టు తెగిపోయిందని దాని మూలంగా పంటలు ముంపుకు, నష్టానికి గురయ్యాయని రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.  పంట నష్టపోయిన రైతులందరికీ వీలైనంత వేగంగా నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.