వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బిసిలకు పెద్దపీట..


Ens Balu
0
Payakaraopeta
2020-10-28 19:53:53

భారతదేశంలో బిసి వర్గాలకు సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యం మరెవరూ ఇచ్చిన దాఖలాలు లేవని పాయకరావుపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం పాయకరావుపేట మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ లలో పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముగ్గురికి ఆయా కార్పొరేషన్ లలో డైరెక్టర్లుగా నియమించడం అభినందనీయమన్నారు. అనంతరం వీరిని ఎమ్మెల్యే గొల్ల బాబురావు వైసీపీ శ్రేణులతో కలసి డైరెక్టర్లను ఘనంగా  సన్మానించారు. రాజ్యాంగ పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేషకుమార్ నిష్పక్షపాతంగా పని చేయడంలేదని, టీడీపీకి కొమ్ముకాసేవిధంగా ఆయన  వ్యవహార శైలి ఉందని ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఆరోపించారు. అంతకుముందు ఎమ్మెల్యే అధ్యక్షతన మార్కెట్ కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, నాలుగు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.