పొట్టి శ్రీరాములు భరతజాతికే ఆదర్శం..
Ens Balu
1
2020-11-01 14:37:21
ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మహా మనిషి పొట్టి శ్రీరాములు అని తిరుపతి అర్భన్ జిల్లా ఎస్పీ ఏ.రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా యస్.పి మాట్లాడుతూ, అనేక పోరాటాల ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్బవించిందన్నారు. భారత దేశం స్వాతంత్ర్యం సాధించాక ఏర్పడిన తరువాత తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమన్నారు. తెలుగు బాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది శ్రీ పొట్టి శ్రీరాములు వల్లనే నన్నారు. 1952 అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 15 అర్థరాత్రి మరణించే వరకు 58 రోజుల ఆమరణ నిరాహారదీక్ష చేశారని, ఫలితంగా జవహర్ లాల్ నెహ్రు నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం దిగివచ్చి 1952 డిసెంబర్ 19న ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. అది అన్ని రాజ్యాంగ నియమాలను పూర్తిచేసుకొని 1అక్టోబర్ 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలని బలమైన ప్రజల కోరికలకు అనుగుణంగా 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాజదానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆ తరువాత నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు మొదటి ముఖ్యమంత్రి పనిచేశారన్నారు. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో..ఈ కార్యక్రమాలలో అడ్మిన్ అడిషనల్ యస్.పి సుప్రజ , డి.యస్.పి లు యస్.బి గంగయ్య, వెస్ట్ నరసప్ప, ఈస్ట్ మురళీకృష్ణ, ట్రాఫిక్ మల్లికార్జున, దిశా పి.యస్ రామరాజు, ఏ.ఆర్ నంద కిశోర్, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.