పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
2
మండపం
2020-11-03 17:06:41

ప్రభుత్వ పశువైద్య శిబిరాలను పాడిరైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారి టి.లావణ్య పిలుపునిచ్చారు. మంగళవారం శంఖవరం మండలం మండపం గ్రామంలో పశువైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి 100 మేకలు50గేదెలు ఆవులు 400గొర్రెలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, సీతాకాలం ప్రారంభంలో పశువులకు వచ్చే వ్యాధులను గుర్తించి గ్రామసచివాలయ వెటర్నీ సహాయకుల ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే వైద్యసహాయం అందిస్తామని చెప్పారు. అదేసమయంలో మేకలు, ఆవులు, గేదెలకు పాడిరైతులు ఇన్స్యూరెన్సులు కూడా తప్పకుండా చేయించుకోవాలన్నారు. తద్వారా పశువులకు ఏం జరిగినా నష్టపరిహారం పొందడానికి అవకాశం వుంటుందన్నారు. గ్రామసచివాలయాల పశుసంవర్ధ సహాయకుల ద్వారా కూడా వైద్యసేవలు పొందవచ్చునన్నారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన వీరి ద్వారా సేవలు పొందడానికి ఆయా గ్రామసచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ సహాయకులు సతీష్ , అనిల్ ,వాలంటీర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.