అనకాపల్లి రోడ్లు బాధ్యత జీవిఎంసీకి అప్పగించండి..


Ens Balu
3
Anakapalle
2020-11-04 15:20:57

అనకాపల్లి నియోజకవర్గంలోని రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలను ఆర్అండ్ బి నుంచి జీవిఎంసీ అధీనంలో మార్పుచేయాలని కోరుతూ, ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి టి.క్రిష్ణబాబుకి వెలగపూడిలో ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాధ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణాలకు నోచుకోకుండా ఉన్న అనకాపల్లిలోని రహదారులతోపాటు, నియోజవర్గ వ్యాప్తంగా మరమ్మతులకు గురైన రోడ్లను తక్షణమే బాగుచేయించాలని కోరినట్టు చెప్పారు. అదేవిధంగా మంత్రి బొత్స సత్యన్నారాయణ ను కూడా కలిసి వినతి పత్రం సమర్పించినట్టు ఎమ్మెల్యే వివరించారు. తన అభ్యర్ధన మేరకు ఇరువురు సానుకూలంగా స్పందించారని అన్నారు. అనకాపల్లి ప్రాంతం జీవిఎంసీలో కలిసిపోయినందున, రోడ్లు, భవనాల మరమ్మత్తులు జివిఎంసీలో కలిపివేయడం ద్వారా పనులు సత్వరమే పూర్తికావడానికి అవకాశం వుంటుందనే విషయాన్ని తెలిసియజేసినట్టు ఎమ్మెల్యే మీడియాకి వివరించారు. అటు మంత్రి బొత్స కూడా రోడ్ల అభివ్రుద్ధికి, మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని హామా ఇచ్చారని అన్నారు.