ప్రతీ ఇంటికి మంచినీటి కుళాయిలు..
Ens Balu
2
Nakkapalli
2020-11-04 17:05:00
పాయకరావుపేట నియోజకవర్గం లోని ప్రతిగ్రామంలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పాయకరావుపేట ఎమ్మెల్యే ఏపి అసెంబ్లీ ఎస్ సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు అన్నారు. బుధవారం నక్కపల్లి మండలం సి.హెచ్.బి ఆగ్రహారంలో వాటర్ స్కీమ్ ను ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతీగ్రామానికి సురక్షిత మంచినీరు అందిచండం ద్వారా మహిళల మంచినీటి కష్టాలను తగ్గించడానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామన్నారు. అన్ని గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి ప్రతీ ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో మినరల్ వాటర్ ప్లాంట్ అంటూ బొమ్మచూపిన టిడిపి నేడు ప్రజల మంచినీటి కష్టాలు తీర్చలేకపోయిందని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అయినా శాస్వతంగా ఉండేలా సీఎం వైఎస్ జగన్ ఎంతో జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.