గుమ్మరేగుల కార్యదర్శిగా ఆర్.నాగు..
Ens Balu
5
Sankhavaram
2020-11-09 18:47:41
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మళ్ళీ సచివాలయాల్లో గ్రేడ్ 4 కార్యదర్శుల నియామకాలను చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఎంపికైన ఉద్యోగులకు నియామక పత్రాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం గ్రామానికి చెందిన రాయి నాగు రౌతులపూడి మండలం గుమ్మరేగుల సచివాలయానికి గ్రేడ్ 4 కార్యదర్శిగా నియమితులు అయ్యారు. గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల ఉద్యోగాలలో కూడా తను అన్నవరం సచివాలయం 3 కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. కాగా ఇప్పుడు తాజాగా గ్రేడ్ 4 కార్యదర్శిగా నియమితులు అయ్యారు. ఈ సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ కలిసి ఆయన ఆశీస్సులు తీసికున్నారు. తాను గుమ్మరేగుల సచివాలయం కార్యదర్శిగా నిధుల్లో చేరిన సందర్బంగా తను మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వం తనకు కేటాయించిన విధులను బాధ్యత, నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు.