కేంద్రానికి వైఎస్సార్సీపీ, టీడిపి వత్తాసెందుకు..


Ens Balu
0
Seethampeta
2020-11-10 18:05:12

రైతాంగం, కార్మికుల జీవితాలు దుర్బరం చేసే చర్యలు, దుర్మార్గపు చట్టాలను కేంద్రం తెస్తుంటే స్వప్రయోజనాలతో  మన రాష్ట్ర అధికార  వైఎస్ఆర్సీపీ , ప్రతిపక్ష టిడిపి వంత పాడుతున్నాయనీ సీపీఎం నగర కార్యదర్శి డాక్టర్  బి. గంగారావు ఆరోపించారు. మంగళశారం విశాఖలోని సిపిఎం అక్కయ్యపాలెం జోన్ కమిటీ  ఆధ్వర్యంలో  ప్రజాచైతన్య యాత్ర  సీతంపేట జంక్షన్ నుంచి రాధాకృష్ణ గుడి,దళిత కాలనీ,80 ఫీట్ రోడ్డు, స్కీం ఇళ్ల కాలనీ, రాజేంద్ర నగర్ వరకూ నిర్వహఇంచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,  కేంద్ర బిజెపి ప్రభుత్వం , ప్రత్యేక హోదా,రైల్వే జోన్ ఊసే ఎత్తడం  లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు  దాసోహమంటు ఎక్కువ మందికి ఉపాధి ఇచ్చే ప్రభుత్వ రంగ స్టీల్,రైల్వే,డిఫెన్స్ మరియు నౌకా,విమాన ,విద్యుత్ రంగాలను ప్రైవేటు వారికిచ్చి ప్రజల బ్రతుకులు ఫణంగా పెడుతున్నారనీ,  ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడే సిపిఎం పార్టీ ఈవిధానాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నాడని,  ఈ నెల 26 న దేశవ్యాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపును ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అంతకు ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి కరపత్రాలు పంచారు. ఈ ప్రచారంలో పార్టీ జోన్ కార్యదర్శి ఆర్పీ రాజు,ప్రదీప్,బాబ్జి,పోతునాయుడు,అప్పారావు,ఆదిలక్ష్మి ,సుందరి తదితరులు పాల్గొన్నారు.