రూ.15లక్షలు బొక్కేస్తే వేడుక చూస్తున్నారు..


Ens Balu
3
s.rayavaram
2020-11-11 13:20:45

ప్రభుత్వ సొమ్ము అప్పనంగా మీ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించి నొక్కాలయానుందా..వాడని బ్లీచింగుకి, వినియోగించని ఫినాయిలుకు, అసలు చెత్త తుడవని చీపుర్లలన్నీ అయిపోయాయని దొంగబిల్లులు పెట్టాలనుందా..సచివాలయంలోకి అవసరమేయ్యే సామాగ్రిని పంపిణీ చేయడానికి సొంత కుటుంబ సభ్యులనే వ్యాపారస్తులను చేయాలనుందా...అయితే మీరు విశాఖజిల్లాలోని ఏదో మేజర్ పంచాయతీలోని గ్రామసచివాలయానికి బదిలీల చేయించుకుంటే సరి...ఇక్కడ అవినీతి జరిగినా, జరిగిన అవినీతి ఆధారాలతో బయట పడినా అధికారులు చర్యలు తీసుకోరు..విచారణ మాత్రం ఆగమేఘాలపై చేసేసి...చర్యలు తీసుకోవడంలో మాత్రం నీళ్లు నములుతారు... ఏంటి ఇంకా అర్థంకాలేదా...అక్రమార్కులను జిల్లాలో స్థాయిలో కాకుండా రాష్ట్రస్థాయిలోనే వెనుకేసుకు వస్తారన్నమాట...ఇదేదో కావాలని అంటున్న మాటలుకాదు ఎస్.రాయవరం మండలంలో (వై.త్రిమూర్తులు(కొరుప్రోలు), డిఎస్వీ అపర్ణ(గుడివా), ఎవివిఎస్.ప్రసాద్(కొత్తరేవుపోలవరం) జరిగిన అవినీతిపైనా, నగదును తమ కుటుంబ సభ్యులకు అడ్డదారిలో పంపిన వైనంపైనా నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారిణి అవినీతి జరిగిన సచివాలయాల్లో(14వ ఆర్థిక సంఘం నిధులు) పై విచారణ చేసి, జరిగిన వ్యవహారాన్ని ఆధారాలతో సైతం వెలికితీశారు(అంతకంటే ముందు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ఈ ముగ్గురు కార్యదర్శిలు చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు సేకరించి వార్తా కధనాలు అందిస్తూ వస్తుంది..ఇపుడు కూడా బ్యాంకు స్టేట్ మెంట్లు మొత్తం ఈఎన్ఎస్ వద్ద భద్రంగా ఉన్నాయి). ఆ విషయాన్ని నేరుగా జిల్లా పంచాయతీ అధికారిణి ద్వారా స్టేట్ కమిషనర్ కి పంపించామని చెప్పిన తరువాత నెలలు గడిచిపోతున్నాయి.. ఒక్క ఎస్.రాయవరం మండలమే కాదు, జిల్లాలో అనేక మండలాల్లో సచివాలయ కార్యదర్శిలుఈఓపీఆర్డీ స్థాయి సిబ్బంది కూడా అవినీతికి పాల్పడమే ఇందుకు నిదర్శనం. ఎస్.రాయవరం మండలంలో  ఆ ముగ్గురు సచివాలయ కార్యదర్శిలు సుమారు రూ.15 లక్షలు మొత్తాన్ని తమ కుటుంబ సభ్యుల ఖాతాలకు నిధులు మళ్లించేసిన విషయం డివిజనల్ పంచాయతీ అధికారి విచారణలో బయటపడినా నేటికీ  అవినీతికి పాల్పడ్డ కార్యదర్శిలపై నేటివరకూ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు మరి కొన్ని బిల్లులు ఇంకా మంజూరు కావాల్సివుంది.. అవికూడా మంజూరైతే అవినీతి మొత్తం మరింత పెరిగే అవకాశం వుంది. ఇదే విషయమై జిల్లా పంచాయతీ అధికారిణి క్రిష్ణకుమారిని ఈఎన్ఎస్ వివరణ కోరగా ఎస్.రాయవరం మండలంలో గ్రామసచివాలయ కార్యదర్శిలు(వై.త్రిమూర్తులు(కొరుప్రోలు), డిఎస్వీ అపర్ణ(గుడివా), ఎవివిఎస్.ప్రసాద్(కొత్తరేవుపోలవరం) అవినీతికి పాల్పడిన విషయంలో నర్సీపట్నం డిఎల్పీఓ విచారణ చేశారని ఆ విచారణ నివేదికను తదుపరి చర్యల నిమిత్తం కమిషనర్ కి పంపినట్టు డిపిఓ తెలియజేశారు.. అధికారులు నుంచి అవినీతి వాస్తవమని ఉత్తర్వులు రాగానే సంబంధింత కార్యదర్శిలు, ఈఓపీఆర్డీపై చర్యలు చేపడతామని చెప్పారు. అయితే రెండు నెలలు దాటుతున్నా నేటికీ సదరు కార్యదర్శిలపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంతపెద్ద మొత్తంలో సచివాలయ సిబ్బంది ఇంత దారుణంగా అడ్డదారిలో ప్రభుత్వ నిధులు బొక్కేస్తే జిల్లా అధికారులు చర్యలు తీసుకునే విషయంలో కాలయాపన చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. మరోవైపు ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారంతా కమిషనర్ కార్యాలయం స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారని కూడా సమాచారం. తాము అవినీతిచేసినా, వారిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రాష్ట్రస్థాయిలో అధికారులను, జిల్లా స్థాయిలో తమ సంఘం నేతలపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది(ఎస్.రాయవరం సచివాలయం ఫోటో వేయడానికి కారణం కూడా లేకపోతేదు ఎవివిఎస్.ప్రసాద్ ప్రస్తుతం ఇక్కడే పనిచేస్తున్నారని)... ఎంతైనా అవినీతి వ్యవహారం కదా... చాలా మందే తోడు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి..ఎం జరుగుతుందో వేచిచూడాల్సిందే..!
సిఫార్సు