బొక్కింది బయటకు కొస్తుందని డుమ్మాకొట్టారు..


Ens Balu
3
ఎస్.రాయవరం
2020-11-12 22:02:24

రూ.లక్షలు అక్రమంగా బొక్కి..మిగిలినవి తను కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్లించుకున్నాడు ఇంకే గ్రామసభకు వస్తాడు.. బహుసా అధికారులే వెళ్లద్దొని ఉంటారు.. ప్రజల సొమ్ము అప్పనంగా మేసినోడు గ్రామసభకి వస్తే జనం కడిగేస్తారని సభకు రాకుండా దాక్కున్నాడు.. ఇంకా డేష్ డేష్ అంటూ తిట్ల దండకం..ఈ మాటలన్నీ అన్నది ఎవరో కాదు విశాఖజిల్లా, ఎస్.రాయవరం గ్రామస్తులు.. ఇదే గ్రామసచివాలయంలో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ నిధులు దారిమళ్లించిన ఈఓపీఆర్డీ త్రిమూర్తులు గురువారం జరిగిన గ్రామసభకు డుమ్మా కొట్టారు. దీంతో గ్రామసభకు వచ్చిన వారంతా నోటికొచ్చిన అమ్మనా బూతులు తిడుతుంటే గ్రామసభ నిర్వహించిన సిబ్బంది అంతా వినలేక...విననట్టు నటించాల్సి వచ్చింది. త్రిమూర్తులతోపాటు, కార్యదర్శి డిఎస్వీ అపర్ణ ఇద్దరే కలిసి సుమారు రూ.10లక్షలు ప్రభుత్వ నిధులు తమ కుటుంబ సభ్యులకు ఖాతాలకు దారి మళ్ళించారు. ఈ విషయం ప్రభుత్వాధికారులకు తెలిసి విచారణ జరిపి వాస్తవాలు రాష్ట్ర అధికారులకు పంపించారు. అయితే నాటి నుంచి నేటి వరకూ గ్రామస్తులకు మొహం చాటేస్తున్న వీరు ఈరోజు జరిగిన గ్రామసభకు కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయ్యింది. నిధులు కాజేసిన విషయం ప్రజలకు తెలిసి మొత్తం ఒకేసారి తిరగబడాతరని గ్రహించే గ్రామసభకు గైర్హాజరయ్యారా అంటూ వచ్చిన సిబ్బందిని అడగటంతో వారంతా ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులంతా ముక్తకంఠం కోరారు. ఇదే విషయాన్ని పదే పదే మీడియాకి తెలియజేయడం కూడా జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది..