సిబ్బంది సమయపాలన పాటించాల్సిందే..


Ens Balu
2
సబ్బవరం
2020-11-12 22:14:13

 ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ సకాలంలో అందే విధంగా  సచివాలయాలు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎమ్. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  గురువారం విశాఖజిల్లాలోని సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం, మొగలిపురం, గొట్టివాడ, ఆరిపాక గ్రామాలలో పర్యటించి సచివాలయ సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, సచివాలయ సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఎప్పుడు, ఎక్కడికి వెళ్లి సేవలు అందించినదీ మినిట్ బుక్ లో రాయాలన్నారు. అదే సమయంలో వివిధ సంక్షేమ పధకాలకు సంబంధించి జాబితాలు ప్రదర్శించాలన్నారు. సచివాలయాలలో ప్రదర్శిస్తున్న సిటిజన్ చార్ట్ ను, లబ్ధిదారుల జాబితాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు అవసరమైన అర్హతలను అందరికీ తెలియ జేయాలన్నారు. గ్రామాలలో పారిశుద్ద్యం పగడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆరోగ్య కేంద్రాలు (వెల్ నెస్ సెంటర్స్), రైతు భరోసా కేంద్రాలను కూడా సందర్శించి ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశారు.