ఎస్.రాయవరంలో ఘనంగా గౌరమ్మ ప్రతిష్ట..
Ens Balu
2
ఎస్.రాయవరం
2020-11-14 15:43:18
విశాఖజిల్లాలోని ఎస్.రాయవరంలో శనివారం గౌరమ్మ వరిదుబ్బును గ్రామస్తులు ఘనంగా ప్రతిష్టించారు. గ్రామంలో పంటుల బాగా పంటలు పండాలని కోరుతూ, గౌరమ్మ ప్రతిష్టిస్తూ వస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్.రాయవరంలో గ్రామపెద్దలు గౌరమ్మపేరుతో వరిదుబ్బును ప్రతిష్టించారు. అమ్మవారి పేరుతో వరిదుబ్బుని తీసి వాటితోపాటు గౌరీపరమేశ్వరుల విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. అమ్మవారిని మేళ తాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గౌరీ పరమేశ్వరుల ఆలయ చైర్మన్ భీమరశెట్టి రమణ అప్పారావు సహాయకులు భీమరశెట్టి నాగ సూరిబాబు, మద్దాల సత్తిబాబు, భీమరశెట్టి సత్యనారాయణ, భీశెట్టి నాయుడు, కొణతాల కృష్ణ, మళ్ళ సత్తిబాబు, సోమిరెడ్డి రాజు, గాలి సత్యనారాయణ, కర్రి శ్రీను, భీమరశెట్టి శ్రీనివాసు గ్రామంలోని మహిళలు, తదితరులు పాల్గొన్నారు.