గురజాడ శిలఫలంతో రాజకీయాలొద్దు..గొల్ల
Ens Balu
2
Payakaraopeta
2020-11-15 14:40:11
గురజాడ అప్పారావుని జాతి జీవితాంతం గుర్తుంచుకుంటుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. ఆదివారం యస్.రాయవరం మండల కేంద్రంలో పునర్ నిర్మించిన గురజాడ కళాక్షేత్రంను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇదే సమయంలో సమాచారహక్కు కార్యకర్త సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో యువకులు ఎమ్మెల్యే బాబూరావుని కలిసి గతంలో గురజాడ కళాక్షేత్రం పునర్ నిర్మాణ పనులను(23.12.18) అప్పటి పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పప్పల చలపతి రావు ప్రారంభించారని ఎమ్మెల్యేకి వివరించారు. అయితే మాజీ ఎంపిటిసి బొలిశెట్టి గోవిందరావు తన అనుచరులు ఎల్లపు నాగు, కర్రి నాగు లతో చట్ట వ్యతిరేకంగా శిలాఫలకం (28.04.2020) తొలగించగా మాజీ ఎమ్మెల్యే అనిత, స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశామని ఎమ్మెల్యీకి వివరించారు. అప్పట్లో టివి ఛానెల్స్, పత్రికల్లో ప్రముఖంగా రావడంతో శిలాఫలకం వెంటనే తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పినా.. నేటికీ దానిని ఏర్పాటు చేయలేదన్నారు. దానినే మీరు ప్రారంభించారని రాజు ఎమ్మెల్యేకి తెలియజేశారు. అయితే పనులు శంకుస్థాపన చేసిన శిలాపలకం తిరిగి ఏర్పాటు చేయకుండా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభోత్సవం చేయడం స్థానిక అధికారులకు నాయకులకే చెల్లిందని, దీని వలన గ్రామంలో అనవసర రాద్దాంతాలకు, ప్రజల మధ్య విబేధాలకు కారణం అవుతున్నాయని ఎమ్మెల్యేకి సోమిరెడ్డి రాజు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బాబూరావు గురజాడ కళాక్షేత్రంలోని శిలాఫలకంతో రాజకీయాలొద్దని అన్నారు. ఇలాంటి విషయాలపై ఫిర్యాదు చేయాలని, ఇటువంటి వాటిపై ఎలాంటి కార్యక్రమం చేపట్టినా నేను తప్పుగా బావించనని ఎమ్మెల్యే గొల్ల చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇదే విషయాన్ని ఎమ్మెల్యే ఎంపిడివో చంద్రశేఖర్, పంచాయితీ కార్యదర్శి ఏ.వి.వి.ఎస్.ప్రసాద్ ని అడగగా ఏర్పాటు చేయకపోవడం నిజమేనని సాయంత్రం లోపు శిలాఫలకం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే ని కలిసిన వారిలో స్థానిక టిడిపి కార్యకర్తలు గాలి సత్యనారాయణ , తాడేల సంతోష్, దుబాసి రమేష్, భీమరశెట్టి శ్రీనివాస్, మద్దాల శ్రీనివాస్, అంగుళూరు శివ తదితరులు ఉన్నారు.