వికెసాగరం చెరువుని ఎస్.రాయవరం సెక్షన్ లో కలపాలి..


Ens Balu
0
s.rayavaram
2020-11-16 20:06:34

విశాఖజిల్లాలోని వికెసాగరం చెరువుని యలమంచిలి నీటిపారుదల శాఖ నుంచి వేరు చేసి ఎస్.రాయవరం నీటిపారుదల శాఖ సెక్షన్ క మార్పు చేయాలని కోరుతూ ఎస్.రాయవరం వాసులు జిల్లా  జిల్లా కలెక్టర్ తోపాటు, నీటిపారుదలశాఖ అధికారులకు స్పందనలో మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం స్పందనలో అర్జీని సమర్పించారు. ఈ సందర్భంగా నీటి సంఘం అధ్యక్షుడు కర్రిసత్యారావు మీడియాతో మాట్లాడుతూ, యస్.రాయవరం మండలంలోని, జె.వి.పాలెం మా గ్రామంలో ఉన్న వి.కె.సాగరం చెరువు ఉండగా నీటిపారుదలశాఖ సెక్షన్ యలమంచిలిలో ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. యస్.రాయవరం మండలంలోని జంగుళూరు వెలంపాలెం(జె.వి.పాలెం) రెవెన్యూ గ్రామంలోని వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు(వి.కె.సాగరం చెరువు) సర్వే నెంబర్ 256 లో ఎకరాలు 99.34 సెంట్లుతో 906 ఎకరాలు ఆయకట్ట ఉందని అయితే  చెరువు సైతారుపేట నుండి యలమంచిలి పోవు తారురోడ్డును, మా గ్రామాన్ని ఆనుకొని ఉన్నదని చెప్పారు.. యస్.రాయవరంలో నీటిపారుదలశాఖ సెక్షన్ ఉన్నప్పటికీ మండలంలో 19 చెరువులు ఉండగా 18 చెరువులు యస్.రాయవరం సెక్షన్ పరిధిలో వుండి  ఒక్క మా వి.కె.సాగరం చెరువు మాత్రం యలమంచిలి సెక్షన్ పరిధిలో ఉన్నకారణంగా... గ్రామానికి ఉన్న ఈ ఒక్క చెరువు మాత్రం యలమంచిలి సెక్షన్ కార్యాలయం పరిధిలో ఉండడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. గతంలో యస్.రాయవరం  మండలంలో ఎలమంచిలి నియోజకవర్గంలో ఉండేదని..అయితే నియోజకవర్గాల పునర్ వ్యవస్తీకరణలో యస్.రాయవరం మండలం పాయకరావుపేట నియోజకవర్గంలోనికి మార్పు చేశారన్నారు. దీనితో మా గ్రామం యస్.రాయవరం మండలం, పాయకరావుపేట నియోజకవర్గంలో ఉండగా మా ఒక్క వి.కె.సాగరం చెరువు యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న, యలమంచిలి నీటిపారుదలశాఖ సెక్షన్ పరిధిలో ఉన్నది. దీని వల్ల ఆయకట్టు దారులమైన మేము అనేక ఇబ్బందులకు గురువుతున్నాము ఆయకట్టు దారులు వివరించారు. రైతుల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని తక్షణమే ఆ చెరువును మార్పుచేయాలని వారు కోరారు.