అక్రమార్కులను హైరింగ్ సెంటర్లకు ఎంపిక చేస్తున్నారు..


Ens Balu
3
s.rayavaram
2020-11-18 11:18:48

అర్హులైన రైతులను కాదని అక్రమార్కులను అవినీతి పరులను  క్లస్టర్ హైరింగ్ సెంటర్లు బాధ్యత అప్పగించాలని అధికారులు చూస్తున్నారని ఎస్.రాయవరం గ్రామానికి చెందిన సోమిరెడ్డి రాజు ఆరోపించారు. ఇదే విషయమై విశాఖజిల్లా కలెక్టర్, వ్యవసాయశాఖ జెడిలకు  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసి అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడారు.  యస్.రాయవరం మండల కేంద్రానికి  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రైతులకు మేలు చేయడానికి క్లస్టర్ హైరింగ్ సెంటర్లు 2 మంజూరు చేసిందన్నారు. ఈ సెంటర్లు ద్వారా గ్రామంలోని రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా 5 గురు రైతులు గ్రూప్ గా ఏర్పడి,  గ్రూపు  సంఘాల ద్వారా నిర్వహించడానికి ప్రతిపాదనలు కోరారని చెప్పారు. అయితే అర్హులైన రైతులకు వీటి నిర్వహణ ఇవ్వకుండా  సంబంధిత అధికారులు ప్రభుత్వ నిబంధనలకు  తూట్లు పొడిచి వాటిని అర్హులయిన వారికి కట్టబెట్టరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు.  అనేక మంది రైతులు ఉండగా గ్రామంలో నాయకులు, రాజకీయ ఏజెంట్లు గా కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ, ప్రభుత్వ పథకాలు పొందడమే లక్యంతో వుండే వ్యక్తులకు హైరింగ్ సెంటర్లను అప్పగించడానికి ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. వారు స్థానికులు కాదని ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారాలకు వచ్చిన వ్యక్తులకు సభ్యులుగా చేసి 2 గ్రూపులుగా ప్రతిపాదనలు చేశారన్నారు.  ఒక్కొక్క గ్రూపుకు 5 గురు సభ్యులుగా గ్రూపులుగా ఏర్పడి ఇందులో ఒక వ్యక్తి కన్వీనర్, రెండవ వ్యక్తి కో కన్వీనర్ గా ఉండి మిగిలిన ముగ్గురు సభ్యులుగా వుంటారు. వీరిలో కన్వీనర్ కో కన్వీనర్ జాయింటుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయవలిసి ఉంటుంది. ఒకొక్క గ్రూపుకు గరిష్టంగా 12 లక్షల రూపాయలు పథకం మంజూరు చేస్తారన్నారు. గ్రూప్ సభ్యులు 10 శాతం స్వంత సొమ్ము, బ్యాంకు లోన్ ద్వారా 50 శాతం, 40 శాతం ప్రభుత్వ సబ్సిడీ మంజూరు చేస్తారని వివరించారు. ప్రభుత్వం నుంచి వచ్చే 40 శాతం అనగా 4.80 లక్షలు సబ్సిడీ మొత్తం, 6 లక్షలు తక్కువ వడ్డీకి బ్యాంకు ఇచ్చు సొమ్ముకు ఆశపడి అర్హులయిన రైతులు కాదని గ్రామాలలో తిరిగే నాయకులు, వ్యాపారస్తులు ఏ రోజూ పొలం వెళ్ళు దాఖలు లేని 10 మంది అనర్హులతో 2 గ్రూపు గా ఏర్పడి లబ్దిపొందడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారని ఆరోపించారు.. ఒకటవ గ్రూపు సంతోష్ బాబు క్లస్టర్ హైరింగ్ సెంటర్ పేరుతో, కన్వీనర్ గా కొణతాల శ్రీనివాసరావు (ఇతడు కొబ్బరి కాయల వ్యాపారం నిమిత్తం అనకాపల్లి నుంచి వలస వచ్చిన వ్యక్తి, వైసీపీ పార్టీ అధ్యక్షుడు) ఇతని బంధువు భీమరశెట్టి అప్పారావు కో కన్వీనర్ గాను, బంధువులు భీమరశెట్టి నాగేశ్వరరావు, కర్రి సూర్యకాంతం, ఏ.సాయి మురళి  గ్రూప్ గా ఏర్పడి ప్రతిపాదించారు.          రెండవ గ్రూప్ నూకాంబికా క్లస్టర్ హైరింగ్ సెంటర్ కన్వీనర్ గా దుబాసి గోవిందరావు (ఇతనుపై ఆసీలు పాట పాడి ఇప్పటికి పంచాయితీకి బకాయిలు చెల్లించని వ్యక్తి, నూకాంబికా దేవాలయం ఆదాయంకు లెక్కలు తెలపని వ్యక్తి, ట్రాక్టర్లు కలిగి ఇసుక, మట్టి అక్రమ రవాణా సొంత ట్రాక్టర్లతో చేయు వ్యక్తి, ఇప్పటికే 2 క్రిమినల్ కేసులు నమోదయిన వ్యక్తి) కో కన్వీనర్ గా దుబాసి కన్నయ్య పంచాయితీ కార్యాలయం లో విద్యుత్ కాంట్రాక్టర్ గా దశాబ్దాలుగా పని చేస్తున్న వ్యక్తి, ఏ రోజు పొలంకు వెళ్ళని వ్యక్తి, ఇప్పటికే 2 క్రిమినల్ కేసులున్న వ్యక్తి, ఇటీవల గ్రామ పంచాయితీ ఆశీల పాటను అక్రమంగా పొంది ఇప్పటికే 3 క్రిమనల్ కేసులు నమోదయిన వ్యక్తి అయిన ఇతని కుమారుడు దుబాసి దేవేంద్ర తో వసూలు చేయిస్తున్న వ్యక్తి), సభ్యులుగా మడగల సూర్యనారాయణ (సొంత ట్రాక్టర్, ప్రాక్లేన్లులు కలిగి ఇసుక ఆక్రమ  నిల్వదారునిగా అందరుకు తెలిసిన వ్యక్తి ఇతని కుమారుడు మడగల త్రిమూర్తులు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి, గత ఏడాది గ్రామ పంచాయితీ ఆశీల పాట వాటాదారుడు ఇప్పటికి పంచాయితీకి బకాయిలు చెల్లించని వ్యక్తి)  ఇతను బంధువు మడగల బాబురావు, దుబాసి కన్నయ్య బంధువు గృహిణి దుబాసి నాగమణి పేరున ప్రతిపాదనలు సిద్దం చేశారన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు లోతుగా విచారణ చేపడితే వాస్తవాలు బయటకు రావడంతోపాట, అర్హులైన రైతులకు లబ్ది చేకూరుతుందని అన్నారు. ఆ విషయాన్ని ఫిర్యాదు రూపంలో అధికారులకు తెలియజేసి, ఇపుడు మీడియా ముందుకి వచ్చినట్టు సోమిరెడ్డిరాజు తెలియజేశారు.  
సిఫార్సు