అందరికి అందుబాటులో వైద్యం..
Ens Balu
2
2020-11-19 16:14:58
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు సైతం మెరుగైన వైద్యాన్ని అందుబాటులో ఉంచి, నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నదే ముఖ్య మంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. దానిలో భాగంగానే వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రూ. 300 లక్షల నాబార్డ్ నిధులతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల నుండి 50 పడకల స్థాయి పెంపునకు, ఆధునీకరణకు, అలాగే భద్రగిరిలో రూ.895 లక్షల నాబార్డ్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఉప ముఖ్య మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీవాణి మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందుబాటులో కి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు ఆడుగులు వేస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతము అయిన పాడేరులో రూ.500 కోట్లలతో మెడికల్ కాలేజీ మంజూరు చేశారంటే, ఆ ప్రాంత ప్రజలు అభివృధి కోసం ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని పార్వతీపురంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ వైద్యం అందే అవకాశం వుందని తెలిపారు. గతంలో ఎవరూ చేయనటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను మనకు మన ముఖ్య మంత్రి అందిస్తున్నారని కొనియాడారు. కురుపాంలో రూ.300 లక్షలు, భద్రగిరిలో రూ.895 లక్షల నాబార్డ్ నిధులతో 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని స్థాయి పెంచడం జరిగింది అన్నారు. భద్ర గిరిలో నేటికి ఒక్క డాక్టర్ తోనే సి.హెచ్.సి కొనసాగుతుందని, డాక్టర్లు అవసరమున్నా, మంజూరు లేక వైద్యులను నియమించుకోలేని పరిస్థితి మొన్నటివరకు ఉంది అన్నారు. ఈ విషయమై గతంలో శాసన సభలో మార్లు ప్రస్తావించడం జరిగింది అన్నారు. కాని ప్రతి పక్షంలో ఉండడం చేత సాధించలేక పోయామన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందని, ప్రజా సంక్షేమ ప్రభుత్వం వచ్చిందని పేర్కొన్నారు. మన ముఖ్య మంత్రి దయవల్ల రూ.8.95 కోట్ల రూపాయలతో భవిషత్తులో అన్ని వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రిగా మారనున్నదని సంతోషం వ్యక్తం చేశారు. గిరిషిఖర ప్రాంతాలనుండి వైద్యం నిమిత్తం వచ్చిన వారికి వైద్యులు,సిబ్బంది లేక గత ప్రభుత్వ హయాంలో వైద్యం అందేది కాదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో వైద్యులను, సిబ్బందిని భర్తీ చేసే ఘనత మన ముఖ్య మంత్రి దేనని కొనియాడారు. కురుపాం నియేజక వర్గం అభివృధి నిమిత్తం నాడు - నేడు లో భాగంగా నివేదికలు పంపడం జరిగింది అన్నారు. ఆరోగ్య శాఖా మంత్రితో మాట్లాడి నిధులు మంజూరు చేయించి కురుపాం ఆసుపత్రి అభివృధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్య మంత్రి ఆశయ ఆచరణలో 108 సిబ్బంది ..మనిషి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదని గుర్తించిన ముఖ్య మంత్రి జగన్మోహన రెడ్డి, ప్రతీ మండలానికి ఒక 108 వాహనాన్ని పూర్తి వైద్య సౌకర్యాలతో అందించారన్నారని శ్రీవాణి చెప్పారు. సమయానికి ఆసుపత్రికి తీసుకు వెళ్ళడానికే ఈ 108 వాహనమన్న ముఖ్య మంత్రి ఆలోచనని 108 సిబ్బంది ఆచరణలో పెట్టారని అభినందించారు. కొమరాడలో నాగావళి నదిని దాటించి, వారికి మెరుగైన వైద్యం అందించి వారికి సురక్షితంగా ఇంటికి చేర్చారని, ముఖ్య మంత్రి ఆలోచనలకి అనుగుణగా 108 సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్, డి.సి.హెచ్. జి.నాగభూషణ రావు, ఎస్. ఇ, ఇ. ఇ ఎ.పి. ఎం. ఐ.డి.సి, కురుపాం, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.