అటవీ హక్కును సద్వినియోగం చేసుకోవాలి..
Ens Balu
2
ముంచింగుపుట్టు
2020-11-20 20:23:16
గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న అటవీ హక్కుపత్రాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. అటవీ హక్కుపత్రాలను విక్రయించకూడదని సూచించారు. శుక్రవారం స్దానిక క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన అటవీ హక్కుపత్రాల పంపిణీకి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ గిరిజన పక్షపాతి అన్నారు. అర్హత కలిగిన గిరిజన రైతులకు పట్టాలు పంపిణీ చేసి రైతు భరోసాను అందిస్తున్నారని చెప్పారు. ముంచింగ్‌పుట్టు మండలంలో రూ.35 కోట్లతో 12 రోడ్లను నిర్మిస్తున్నామన్నారు. అడవులను పరిరక్షించుకోవలసిన బాద్యత అందరిపైనా ఉందన్నారు. గిరిజన రైతులకు సిల్వర్ ఓక్,కాఫీ, మిరియాల నర్సరీలు పెంచుకునేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామాల మాట్లాడుతూ 2005కు ముందు పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు అటవీ హక్కుపత్రాలు మంజూరు చేస్తామన్నారు. పది ఎకరాల వరకు సాగుచేస్తున్న పోడు భూమలు పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. అటవీ హక్కుపత్రాలు పొందిన ప్రతీ రైతుకు రైతు భరోసా అందిస్తామన్నారు. ఏజెన్సీలో ప్రతీ గిరిజన కుటుంబానికి భూమి కలిగి ఉండేలే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు పోడుభూములు లేని గిరిజన రైతులకు డి పారం పట్టాలను మంజూరు చేస్తామన్నారు. పోడు భూముల్లో సాగు చేయడానికి సిల్వర్,కాఫీ,మిరియాల మొక్కలను పంపిణీ చేస్తామన్నారు. గిరిజన రైతులు సాగు చేస్తున్న రాగులకు ప్రభుత్వమే కిలోకు రూ.33 లు ధాన్యానికి 18.90లు చెల్లిస్తుందన్నారు . రాగులు, ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు విక్రయించాలని చెప్పారు. వారపు సంతల్లో దళాలను నమ్మి మోసపోవద్దన్నారు. ముంచింగ్ పుట్టు మండలంలో859 మంది రైతులకు 1178 ఎకరాల పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అతిధులు చేతుల మీదగా లబ్దిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసారు. ఈ సమావేశంలో తాహశీల్దార్ ఎం.శ్యాంబాబు, ఎంపిడి ఓ ఎ వివి కుమార్, స్దానిక నేతలు ,గిరిజన రైతులు పాల్గొన్నారు.