గిరిజనుల అభివ్రుద్ధే ప్రభుత్వ లక్ష్యం..


Ens Balu
2
Araku Valley
2020-11-21 18:03:53

వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనుల అభివ్రుద్ధి కోసం చేపట్టిన మహత్తర కార్యక్రమం అటవీ భూ హక్కు పత్రాల పంపిణీ అని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గున అన్నారు. శనివారం అరకువేలి మండలంలో గిరిజనులకు మంజూర పట్టాలను ఆయన ఐటిడిఏ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ కలలు గన్న కార్యక్రమాన్ని ఆయన కొడుకే నేడు సీఎం గా గిరిజనుల అభివ్రుద్ధికోసం అటవీ భూమి హక్కు పత్రాల పంపిణీ చేపట్టారన్నారు. తద్వారా అర్హులైన గిరిజన రైతులందరికీ భూమి ఏర్పడి వారి అభివ్రుద్ధికి మార్గం సుగమం అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో  రెవిన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి . ఈ కార్యక్రమంలో  అరకు తహశీల్దార్, ఎమ్.పి.డి.ఒ, మరియు రెవెన్యూ సిబ్బంది, అధిక సంఖ్యలో గిరిజన రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.
సిఫార్సు