ఎస్.రాయవరం సచివాలయంలో ఆథార్ జూలకటక..


Ens Balu
3
s.rayavaram
2020-11-21 20:56:57

కహానీలు నమ్మే అధికారులుంటే కట్టుకధలు ఫోటోలు చూపించి మరీ చెప్పొచ్చునని ఎస్.రాయవరం గ్రామసచివాలయ సిబ్బంది నిరూపిస్తున్నారనే ప్రచారం జోరుగగా సాగుతోంది..లేని ఆధార్ కేంద్రం ఉన్నట్టుగా..ప్రైవేటు వ్యక్తులతో ప్రభుత్వ గ్రామసచివాలయంలో ఫోటోలు తీయించుకొని, వాటిని సామాజిక మాద్యమాల్లోకి పంపుతూ మరీ హడావిడీ చేస్తున్నారు. విషయం బయటకు తెలియడంతో అదేం లేదు కానీ.. అంటూ నాలుక కరుచుకుంటున్నారు..ఇదంతా జిల్లా అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడమే దీనికి కారణంగా కనిపిస్తుంది విశాఖజిల్లాలోని ఎస్.రాయవరం మండల కేంద్రమైన ఎస్.రాయవరం లో ఆధార్ నమోదు కేంద్రం ఒక చోట ఇస్తే నిర్వహణ మరోచోట జరుగుతుంది. దీనికి సాక్షాత్తు సచివాలయ అధికారులే అవకాశం కల్పించడం గామాన్హారం. గ్రామ సచివాలయ కార్యాలయ భవనంలో ఆధార్ సెంటర్ కోడ్ 205231654 ప్రకారం నిర్వహిస్తున్నట్లు రికార్డుల లో పంచాయతీ కార్యదర్శి ఏ వి ఎస్ ఎస్ ప్రసాద్ తో కలిసి ఉన్నతాధికారులకు చూపిస్తూ కర్రి జోగారావు అనే వ్యక్తి  గురజాడ షాపింగ్ కాంప్లెక్ ఎదురుగా నిర్వహిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఆధార్ కేంద్రం నిర్వహించకుండా వారంలో ఒక రోజు తూతూ మంత్రంగా ఆధార్ సేవలు నిర్వహించి ఫోటోలకు పోజులు ఇచ్చి ఇటు స్థానిక అధికారులను,అటు యూ.ఐ. డి ఆధార్ అధికారులను మభ్యపెడుతున్నారని మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త ఆరోపిస్తున్నారు. ఇదేవిషయమై సచివాలయ అధికారులతో మాట్లాడితే పొంతన లేని సమాధానం చెబుతున్నారని రాజు మీడియాకి వివరించారు. కాగా ఈ విషయం ఒక్క పంచాయతీ కార్యదర్శి కి మాత్రమే తెలుసా ? లేక మండల స్థాయి అధికారులకు తెలుసా అనే సంగతి ఆ పెరుమాళ్లకే తెలియాలి అంటున్నారు. మామూళ్ల మత్తులో అధికారులు ఉండటం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు జిల్లా అధికారులు కొన్ని చోట్ల ఆధార్ కేంద్రాలు గ్రామసచివాలయాలకు పైలెట్ ప్రాజెక్టుగా మంజూరు చేశాయి. అయితే వాటిని ప్రభుత్వ సిబ్బందే నిర్వహిస్తున్నారు. కానీ ఎస్.రాయవరంలో మాత్రం ప్రభుత్వ భవనంలోప్రైవేటు వ్యక్తులు నిర్వహించడంపైనా రాజు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విదషయాన్ని జిల్లా అధికారులు, ఆథార్ నిర్వాహకులు, అటు మీసేవాల అధికారులకు ద్రుష్టికి తీసుకెళుతున్నట్టు ఆయన మీడియాకి వివరించారు. తక్షణమే అధికారులు ప్రభుత్వ భవనంలో ప్రైవేటు నిర్వాహకులతో చేపడుతున్న ఆథార్ కేంద్రంపై వివరణ ఇవ్వకపోతే ఎవరు ఏ  కార్యాలయంలో ఏ పని చేస్తున్నారో అర్ధం కాని పరిస్థి నెలకొంటుందని చెబతున్నారు..
సిఫార్సు