రైతుల ఎరువులకు కెఎన్ఆర్ ఆర్ధిక సహాయం..


Ens Balu
4
కె.కోటపాడు
2020-11-22 11:27:08

రైతు శుభిక్షంగా ఉంటే దేశం సౌభాగ్యంగా వుంటుందని గాజువాక బీజేపి నియోజకవర్గ కన్వీనర్ కె.నరసింగరావు అన్నారు. ఆదివారం  కే.కోటపాడు మండలం, సూదివలస గ్రామంలో గల 20మంది సన్నకారు రైతుల ఎరువులను పంపిణీకి ఆర్దికసాయం చేసారు. ఈ సందర్భంగా కే.ఎన్.ఆర్ మాట్లాడుతూ సన్నకారు రైతులు అప్పులు చేసి వ్యవసాయంలో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.  దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతిరైతు కుటుంబం ఆనందంగా వుండాలని మన దేశ ప్రదాని  నరేంద్ర మోదీ ఓకే దేశం - ఓకే పంట ద్వారా దేశంలో రైతులు తాము పండించిన పంట దేశంలో ఎక్కడైనే అమ్ముకొనే అవకాశం కల్పించి రైతుల ఆదాయం రెండింతలు వచ్చేవిదంగా చేశారన్నారు. అమ్మచారిటబుల్ ట్రస్టు సభ్యులు సన్నకారు రైతులను గుర్తించి వారికి ఎరువులు , పనిముట్లు,విత్తనాలు ఇవ్వడంతో పాటు , వారితో కలసి ఒకరోజు శ్రమదానం కూడా చేస్తున్నందుకు వారిని అభినందించారు.  ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ స్వచ్చంద సంస్ధ చైర్మన్ బాటా శ్రీను, ట్రస్టీలు బాస్కర్, అయ్యల నాయుడు,ఉషారాణి, లక్కీ షాపింగ్ మాల్ అధినేత స్వామి , ప్రముఖ వ్యాపారవేత్త రాజు గారు, మాజీసైనికులు కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు