నాడు-నేడులో భారీ అవినీతి..


Ens Balu
0
Golugonda
2020-11-23 20:45:27

గొలుగొండ మండలంలో  నాడు- నేడు పాఠశాలలో అభివ్రుద్ధి పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆర్. టి. ఐ  ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జక్కు నరసింహమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్. యం. సి. కమిటీ , ప్రధాన ఉపాధ్యాయులు కలిసి నిర్ణయించి నాణ్యమైన గ్రానైట్ కొనుగోలు చేయవలసి ఉండగా ప్రధానోపాధ్యాయులు ఏకపక్షంగా గ్రానైట్ సరఫరా దారునితో లాలూచీపడి  మండలంలో గల పాఠశాలలో అన్నిటి కి సరఫరా చేయడంలో ఆంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు. ఎస్ ఎం సి  కమిటీ చైర్మన్లు గ్రానైట్ కొనుగోలు లో మమ్ములను సంప్రదించకుండా వారు ఇష్టారాజ్యంగా చేసి ప్రభుత్వమే సరఫరా చేసిందని దాని యొక్క సొమ్ము చెల్లించాలని ఖాళీ చెక్కులు పై ప్రధాన ఉపాధ్యాయులు  సంతకాలు తీసుకోవడం లో అవినీతికి నిదర్శనం అన్నారు . జిల్లాలో చాలా మండలాల్లో నచ్చిన చోట ఎస్. ఎం.సి.  నిర్ణయం మేరకు పలు షాపుల్లో కొనుగోలు చేశారని కానీ గొలుగొండ మండలానికి నర్సీపట్నం నుంచి సరఫరా చేయడంలో జిల్లా అధికారుల పాత్ర ఉందా ? లేక మండల అధికారుల పాత్ర ఉందా ? లేక ప్రధానోపాధ్యాయులా ఉందా ? దీనిపై విచారణ జరిపితే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్రుష్టికి కూడా తీసుకెళ్లనున్నామని ఆయన మీడియాకి వివరించారు.