జగనన్నతోడుతో ఆర్ధికాభివ్రుద్ధి..


Ens Balu
3
Nakkapalli
2020-11-25 16:48:26

చిరువ్యాపారులకు జగనన్నతోడు పథకంతో ఆర్ధికాభివ్రుద్ధి సిద్ధిస్తుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు అన్నారు. బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్నతోడు పథకాన్ని నియోజకవర్గ పరిధిలో నక్కపల్లి లో ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబురావు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ‘జగనన్న తోడు’ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా దళారులు, వడ్డీ వ్యాపారుల నుంచి ఇబ్బందుతు తొలగుతాయని చెప్పారు.  కాగా అనేక మంది చిరు వ్యాపారులు 36–60 శాతం వడ్డీతో అప్పులు తెచ్చుకుని అష్టకష్టాలు పడుతున్నారని అలాంటి వారికి ఎంతో చేయూతనిచ్చే పథకంగా మారుతుందని అన్నారు.  రోడ్డు పక్కన రోజువారీ వ్యాపారాలు చేసేవారు, తోపుడు బండ్లు, చిన్న చిన్న కూరగాయల వ్యాపారులు, రోడ్ల పక్కన టిఫిన్, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులు ఈ రుణానికి అర్హులని చెప్పారు. . ఈ పథకంను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే లబ్దిదారులకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చిరువ్యాపారులు పాల్గొన్నారు.
సిఫార్సు