ప్రజావ్యతిరేక కర్మాగారాలకు అనుమతించేదిలేదు


Ens Balu
3
రాజయ్యపేట
2020-11-25 21:18:33

 ప్రభుత్వం గాని, తాను గాని ఎల్లప్పుడూ రైతు పక్షమేనని, ప్రజలకు ఇబ్బంది, నష్టం కల్గించే పరిశ్రమలను తాను కూడా ప్రోత్సహించబోనని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు స్పష్టం చేశారు. బుధవారం రాజయ్యపేట వద్ద విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఎమ్మెల్యే బాబూరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను అధికారంలో లేనప్పుడూ, వున్నప్పుడూ ఒకే మాట, సిద్దాంతానికి కట్టుబడి వుంటానని చెప్పారు. హెటెరో పరిశ్రమ వల్ల కొన్ని నష్టాలు కలుగుతున్నాయన్న విషయాన్ని తాను కూడా గుర్తించానని చెప్పారు. కారిడార్ భూములకు సంబంధించి 2013 భూసేకరణ ప్రకారం పరిహారం, జిరాయితీ భూములకు సమానంగా డి.పట్టా భూములకు పరిహారం, ఫలసాయం, గృహాలకు ముందుగా చెప్పిన మాట ప్రకారం పరిహారం ఇవ్వలేదన్న విషయాన్ని రైతులు ఇటీవలే తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. ఈ భూసేకరణ, పరిహారం పంపిణీ తదితర అంశాల్లో కొన్ని అక్రమాలు జరిగినట్టు తెలిసిందని, పది రోజుల్లో ఎస్డీసీలతో గ్రామాల వారీగా సమగ్ర పరిశీలన జరిపిస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు, రైతులు, చేతివృ త్తుల వారికి అన్ని రకాల ప్రయోజనాలు చేకూర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంచినీరు, విద్యవైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
సిఫార్సు