లబ్దిదారుల ఎంపిక పారదర్శంగా జరగాలి..


Ens Balu
3
పాడేరు ఐటిడిఏ
2020-11-26 16:32:28

ట్రైకార్ ద్వారా మినీ ట్రక్కులు మంజూరు చేయడానికి లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ఏజెన్సీలో పేద గిరిజన నిరుద్యోగులకు మినీ ట్రక్కులు ఆర్దిక భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు . మన్యంలోని 11 మండలాల ఎంపిడి ఓలు ,గ్రామ సచివాలయాల వెల్ఫేర్ సహాయకులతో గురువారం మధ్యాహ్నం ఐటిడి ఏ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా లో 158 మంది గిరిజన అభ్యర్దులకు మినీ ట్రక్కులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈనెల 27తో దరఖాస్తుల గడువు ముగిస్తుందన్నారు. డిసెంబరు 4 వతేదీన దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మౌఖిక పరీక్షలు నిర్వహించడానికి నలుగురు అధికారుల బృందాన్ని నియమించామని చెప్పారు. ఇంటర్వూలను అనుమానాలకు తావు లేకుండా పగడ్భందీగా నిర్వహించాలని అధికాలను ఆదేశించారు. ఎంపిక చేసిన అభ్యర్దుల జాబితాను వెంటనే ఐటిడి ఏ కు సమర్పించాలన్నారు. అభ్యర్దుల అర్హతలు పక్కాగా గుర్తించి ,ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సక్రమంగా అమలు చేయాలని స్పష్టం చేసారు. గ్రామ వాలంటీర్ల పరిధిలో 50గృహాల కంటే ఎక్కువ గృహాలు ఉన్న వాలంటీర్ల జాబితా సిద్దం చేసి సమర్పించాలని సూచించారు. అవసరమైన చోట అదనపు గ్రామ వాలంటీర్ల నియమాకానికి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. 11 మండలాల్లో ఉద్యానవన గిరిజన రైతులకు 1740 బ్యాటరీతో నడిచే పిచికారీ పరికరాలు పంపిణీ చేసామని , లబ్దిదారుల జాబితాను ఐటిడి ఏ సమర్పించాలన్నారు. ముంచింగ్‌పుట్టు, హుకుంపేట, పెదబయలు,జి.మాడుగుల , జికె వీధి మండలా ఎంపిడి ఓలు వెంటనే రిపోర్టులు నేటికి రాలేదని ఈనెల 30 వతేదీలోగా పంపించాలన్నారు. ఈ సమావేశంలో ఐటిడి ఏ సహాయ ప్రాజెక్టు అధికారి (జనరల్) వి ఎస్ ప్రభాకర్ , ప్రాజెక్టు ఉద్యాన వన అధికారి జి.ప్రభాకరరావు,ట్రైకార్ సహాయకులు సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు