అంభేద్కర్ గుర్తుగా పోస్టల్ కేరీ కవర్..
Ens Balu
5
Payakaraopeta
2020-11-26 21:08:15
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాదదూళితో పునీతమైన ప్రాంతం తుని పట్టణమని పాయకరావుపేట ఎమ్మెల్యే, అసెంబ్లీ ఎస్సి వెల్ఫేర్ కమిటీ చైర్మన్ గొల్లబాబూరావు కొనియాడారు. విశాఖపట్నం నుంచి తుని రైలు ప్రయాణం ద్వారా వచ్చి చరిత్రాత్మక పర్యటన జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ తపాలా శాఖ స్పెషల్ కెరీ కవర్ విడుదల చేపట్టారు. దానాని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, 1944 సంవత్సరం అంబేద్కర్ తుని వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లుతో కలిసి ఈ కవర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా వుందన్నారు. నవంబర్ 26న అంబేద్కర్ తుని విచ్చేసిన రోజు కావడం, భారత రాజ్యాంగం ఆమోదింపబడిన రోజు కావడం మరువలేని రోజు అని తెలియజేశారు. నేటి యువతరానికి అంబేద్కర్ స్ఫూర్తిదాయకమన గొల్ల తపాలా ఏపీ శాఖ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మంచి కార్యక్రమానికి నాంది పలికారన్నారు. పోస్టుమాస్టర్ జనరల్ మాట్లాడుతూ, తపాలా శాఖ చరిత్రాత్మక , సామాజిక,ప్రత్యేక కలలు,చరిత్రలో నిలిచి వుండే అంశాలపై తపాలాశాఖ స్పెషల్ కెరీ కవర్ విడుదల చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారుల, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.